👉` అపస్మార్క స్థితిలో యువతి
👉`` గాజువాక లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించిన స్థానికులు
👉`` ప్రేమ వ్యవహారమే దాడికి కారణం
పరవాడ,జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామంలో ఓ దళిత యువతపై పట్టపగలు కత్తితో దాడి జరిగింది. గొంతు కొడవలితో కోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన యువతి. హుటాహుటిన గాజువాక లోని ఓ ప్రైవేట్ ఆసుత్రికి స్థానికలు తరలించరు. 50 కుట్లు పడడంతో ప్రాణపాస్థితిలో యువతి కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటన సంబంధించి స్థానికులు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సాయి నగర్ కాలనీకి చెందిన యశోద (31) ఇదే గ్రామానికి చెందిన రమేష్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో రమేష్ తల్లిదడ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో యశోద మూడు నెలల క్రితం పరవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో రమేష్ యశోదను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినప్పటికీ రమేష్ తండ్రి ఒప్పుకోకపోవడంతో వివాహం వాయిదా పడిరది. ఇప్పుడు యశోద గర్భిణీ కావడంతో మరోసారి పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో రమేష్ తండ్రి కంపర సత్యనారాయణ సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో యశోద దేశపత్రినిపాలెం చెక్ పోస్ట్ దగ్గర గొడవ పెట్టుకొని ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. రమేష్ సోదరి భారతి ఆమె భర్త నర్సింగరావు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన యశోదను గాజువాక లోని ఆర్కే ఆసుపత్రికి ప్రియుడు రమేష్ మరి కొంతమంది స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ విషయంలో పోలీసు వ్యవహార శైలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఫిర్యాది ఇచ్చిన దళిత యువతకి సకాలంలో న్యాయం చేయకపోగా రక్షణ కల్పించలేకపోయారని విమర్శిస్తున్నారు. పోలీసుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈ దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.