👉 ఈవీఎంల పై ఎలాన్ మస్క్‌కి ట్రైనింగ్ ఇస్తాం
👉 కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
న్యూ డిల్లీ, జూన్ 17 (ఇయ్యాల తెలంగాణ) : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల వినియోగంపై బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈ క్రమంలో మస్క్ ఆలోచన విధానం అమెరికా సహా ఇతర ప్రాంతాల్లో అమలు చేయవచ్చు. కానీ భారతదేశంలో ఈవీఎంలను మాత్రం హ్యాక్ చేయడం అసలు సాధ్యం కాదన్నారు.అమెరికాలో ఇంటర్నెట్ ఆధారంగా ఓటింగ్ మిషన్లు) పనిచేస్తాయని, ఇండియాలో మాత్రం వీటిని బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ వంటి ఏ మార్గాల ద్వారా కనెక్ట్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఈవీఎంలను రీప్రోగ్రామ్ చేయడం సాధ్యం కాదని వెల్లడిరచారు. ఈ విషయంలో అవసరమైతే ఎలాన్ మస్క్‌కి ట్రైనింగ్ కూడా ఇస్తామని, వీటిని విూ దేశంలో కూడా తయారు చేయవచ్చని చంద్రశేఖర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.