బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఫరూక్
త్యాగ నిరతికి, అల్లాప్ాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగ (ఈద్ ఉల్ ఆదా) అని న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు
ఈ సందర్భంగా స్థానిక భీమవరం రూట్ లో ఉన్న ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడుతూ స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశం అన్నారు . ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం, అల్లాప్ా ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రవక్తల అచంచలమైన భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటి చెబుతుందన్నారు .