ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోంది
ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడిరచిన సీఎం చంద్రబాబు
పోలవరం, జూన్ 17 (ఇయ్యాల తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించి సవిూక్షి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడిరచారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని, పోలవరం ప్రాజెక్టుని ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొ?న్నారు.2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూరదృష్టితో పోలవరం ముంపు ప్రాంతంలోని తెలంగాణాకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించామని చంద్రబాబు గుర్తుచేశారు. నాటి ఎన్డీయే`2 కేబినెట్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయగలిగామని చంద్రబాబు ప్రస్తావించారు. అప్పటికే పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభాల్లో ఉందని, 2005లో వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టు పనులపై అప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని చెప్పారు.ఇక డ్యామ్ ఎత్తు 45.72 విూటర్ల డ్యాం ఎత్తు ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, ఆ ఎత్తును తగ్గించడానికి ప్రయత్నించారని చంద్రబాబు అన్నారు. స్పిల్ వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లేలా డిజైన్ చేశామని, చైనాలో త్రీ గార్జియస్ ప్రాజెక్టు ద్వారా మాత్రమే అంత ఎక్కువ వాటర్ డిశ్ఛార్జి అవుతోందని పేర్కొన్నారు.
అలాంటోళ్లు రాజకీయాల్లోకి వస్తే ఇలా ఉంటుంది..
రాజకీయాల్లో ఉండ తగని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఆయన రావడం తప్పు కాదు. క్షమించరాని నేరం. అప్పటి నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. వైసీపీ ప్రభుత్వం రావడమే రివర్స్ టెండరింగ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే కాంట్రాక్టు ఏజెన్సీని మార్చేశారు. 2020 వరదల్లో డయాఫ్రం వాల్ 35 శాతం పాడయ్యింది. రూ.480 కోట్లతో అత్యవసరంగా నిర్మిస్తే దానిని అలా చేశారు’’ అని వివరించారు.