చార్మినార్, జూన్ 20 (ఇయ్యాల తెలంగాణ) మీ పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల కోసం ఆరోగ్య శాఖా అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థించండి. జూన్ 20 న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా థీమ్ ఆరోగ్య కరమైన అలవాట్లు సంతోషకరమైన పిల్లలు భాగంగా తల్లి, తండ్రులు పిల్లల ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యకమానికి ప్రత్యేక అతిథిగా చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ కమీషనర్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ మరియు విద్య మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం మరియు స్వచ్ఛ భారత్ పాల్గొన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం ఈ రోజు యూపీహెచ్ సి పంజేషా 1 లో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ సూరజ్ భాన్ క్లస్టర్ తో నిర్వహించారు. డాక్టర్ సునంద మరియు వైద్య అధికారులు డాక్టర్ అబ్రార్ ఉల్ హాక్ షేక్ డాక్టర్ శ్రీ రామ్ రాఘవేందర్ డాక్టర్ అనీస్ అహ్మద్ సిద్దిఖ్ వైద్య బృందం పి హెచ్ ఎన్ నర్సింగ్ అధికారి ఆశలతో జాతీయ ఆరోగ్య మిషన్ తెలంగాణ హైదరాబాద్
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం లక్ష్యం 1-19 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ఆరోగ్యం పోషకాహార స్థితి విద్య మరియు జీవన నాణ్యతను మెరుగు పరచడం కోసం పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల వేదిక ద్వారా అన్ని ప్రీ స్కూల్ మరియు పాఠశాల వయస్సు పిల్లలకు నులి పురుగులును తొలగించడం స్టేషన్ వెలుపల లేదా ఆరోగ్య సమస్యల కారణంగా ఈ రోజు తప్పిపోయిన పిల్లల కోసం 27 జూన్ 2024 న మోపప్ నిర్వహించబడుతుంది. పిల్లల ఆరోగ్యం ఎదుగుదల మరియు శ్రేయస్సు కోసం మోపప్ NDD అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ తల్లి, తండ్రులందరిని అభ్యర్థిస్తోంది.