`నేడు ఆయన వర్ధంతి
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించి, తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పి శ్రీశ్రీగా ఎదిగి, మహాకవిగా గుర్తింపు పొందారు శ్రీరంగం శ్రీనివాసరావు, 1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పటకొండ దంపతులకు విశాఖపట్నంలో జన్మించాడు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటి పేరు శ్రీరంగం గా మారింది. శ్రీశ్రీ ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నం లో జరిగింది. శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రారంభించాడు. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడిరది.1931లో మద్రాసు యూనివర్సిటీలో బి.ఏ పూర్తి చేశాడు.1935లో విశాఖలోని మిసెస్ ఎవిఎస్ కాలేజీలో డిమాన్స్టేటరుగా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటరుగా చేరారు. ఆ తర్వాత ఢల్లీి ఆకాశవాణిలోను, నిజాం సంస్థానంలోను, ఆంధ్రవాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుంచి 1940 వరకు తాను రాసిన ‘గర్జించు రష్యా’, ‘జగన్నాథ రథ చక్రాలు’ వంటి గొప్ప కవితలను సంకలనం చేసి ‘మహా ప్రస్థానం’ అనే పుస్తకంగా ప్రచురించాడు శ్రీశ్రీ. తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన పుస్తకం గా శ్రీశ్రీ మహాప్రస్థానం మిగిలిపోయింది. ఈయన ప్రముఖ హాస్యనటుడు రాజబాబుకు తోడల్లుడు. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు.
వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించాడు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడవిూ అవార్డు, మొదటి ‘‘రాజా లక్ష్మీ ఫౌండేషను’’ అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేసాడు. 1970లో అతని షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే అతను అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడిరది. కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది... మరో ప్రపంచం,మరో ప్రపంచం,మరో ప్రపంచం పిలిచింది!పదండి ముందుకు,పదండి త్రోసుకు!పోదాం, పోదాం పైపైకి!కదం త్రొక్కుతూ,పదం పాడుతూ,హ్రుదాంతరాళం గర్జిస్తూ`పదండి పోదాం,వినబడలేదామరో ప్రపంచపు జలపాతం?దారిపొడుగునా గుండె నెత్తురులుతర్పణ చేస్తూ పదండి ముందుకు!బాటలు నడచీ,పేటలు కడచీ,కోటలన్నిటిని దాటండి!నదీ నదాలూ,అడవులు, కొండలు,ఎడారులా మన కడ్డంకి?పదండి ముందుకు!పదండి త్రోసుకు!పోదాం, పోదాం, పైపైకి!ఎముకులు క్రుళ్ళిన,వయస్సు మళ్ళినసోమరులారా! చావండి!నెత్తురు మండే,శక్తులు నిండే,సైనికులారా! రారండి!’’హరోం! హరోం హర!హర! హర! హర! హర!హరోం హరా!’’ అని కదలండి!మరో ప్రపంచం,మహా ప్రపంచంధరిత్రినిండా నిండిరది!పదండి ముందుకు,పదండి త్రోసుకు!ప్రభంజనంవలె హోరెత్తండీ!భావ వేగమున ప్రసరించండీ!వర్షుకాభ్రములన ప్రళయఘోషవలెపెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!పదండి,పదండి,పదండి ముందుకు!కనబడలేదా మరో ప్రపంచపుకణకణమండే త్రేతాగ్ని?ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవిఎనభై లక్షల మేరువులు!తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్జలప్రళయ నాట్యం చేస్తున్నవి!సలసలక్రాగే చమురా? కాదిదిఉష్ణరక్త కాసారం!శివసముద్రమూ,నయాగరావలెఉరకండీ! ఉరకండీ ముందుకు!పదండి ముందుకు!పదండి త్రోసుకు!మరో ప్రపంచపు కంచు నగారావిరామ మెరుగక మ్రోగింది!త్రాచులవలెనూ,రేచులవలనూ,ధనంజయునిలా సాగండి!కనబడలేదా మరో ప్రపంచపుఅగ్నికిరీటపు ధగధగలు,ఎర్రబావుటా నిగనిగలు,హోమజ్వాలల భుగభుగలు?