Ticker

6/recent/ticker-posts

Ad Code

YADADRI పేరును గతంలోగా యాదగిరి గుట్టగా మార్పుచేస్తాం !


యాదాద్రి పేరును గతంలోగా యాదగిరి గుట్టగా మార్పుచేస్తాం - 

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వెల్లడి

నల్లగొండ మార్చ్‌ 2 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పుచేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే జీవో ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కోమటిరెడ్డి విూడియాతో చిట్‌చాట్‌లో యాదాద్రి పేరుమార్పుపై స్పందించారు.భువనగిరి నుంచి పోటీ చేయమని పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకి చెప్పానన్నారు. భువనగిరి, నల్లగొండ, ఖమ్మం పార్లమెంట్‌ స్థానాల్లో దక్షిణ భారతదేశంలోనే భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కంటే రాహుల్‌ అత్యధిక ఓట్లతో గెలుస్తారని చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు