ఇతిహాస పురాణ చరిత్రలోనే శివదీక్ష ప్రాచుర్యం పొందినట్లు విక్రమాదితున్ని,తామ్ర శాసనం ద్వారా తెలుస్తుంది. వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతీదేవి, జగన్మాత పార్వతీదేవి చేపట్టి, పరమశివుడి అనుగ్రహం వల్లే అర్ధాంగి అయినది. శివుని శరీరంమదు అర్థం భాగం స్వీకరించుటచే, పరమేశ్వరుడు కూడా అర్ధనారీశ్వరుడు గా మారాడు. కాగా బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, శ్రీరామ చంద్రుడు, శ్రీకృష్ణుడు, భక్తకన్నప్ప, పర్వతుడు, భక్త సిరియాలుడు వారు కూడా శివ దీక్షను పాటించారు.కార్తికేయుడు కూడా శివ దీక్షను పూని దేవత సీన్యాలకు అధిపతి అయ్యాడు. ఇంతటి దివ్య మహిమగల శివదీక్ష ఎంతో ప్రాచీనమైనదిగా చెప్పవచ్చు. శివదీక్షతో మోక్ష ప్రాప్తి, మానసిక ప్రశాంతత లభిస్తుందన్న సంకల్పంతో, లక్షలాదిమంది శివ భక్తులు దీక్షను స్వీకరిస్తున్నారు. నియమ నిష్ఠలతో దీక్షను పూర్తిచేసి,మార్చి 8న జరిగే మహాశివరాత్రి నాటికి, స్వామివారికి ఇరుముడి సమర్పించేందుకు సన్నతమవుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కుర్ గ్రామంలో శివాలయాలు శివనామ స్వరముతో మారుమోగుతున్నాయి.
శివ స్వాములు ఆచరించే మండల దీక్ష మానవ జీవన చక్రం పై ఆధారపడి ఉంటుంది. శివ స్వాముల దీక్ష చివరి నాటికి ఇరుముడి ధారణతో శివుడి సన్నిధికి చేరుకుంటారు. శివ స్వాములు ఎక్కువగా పాదయాత్రగా తరలి వెళ్తుంటారు. ఇందుకోసం గోధుమ వర్మ సంచిలో స్వామి, అమ్మవారికి, నివేదించేందుకు సరంజామతోపాటు నైవేద్యం తీసుకువెళ్లడమే ఇరుముడి ధారణ. ఇందులో స్వామివారికి ఆవు నెయ్యి, తేనె, కుంకుమ, గంధం, విభూది, బిల్వం, అధర్భత్తులు, మూడు కొబ్బరికాయలు, కర్పూరం తో పాటు, బియ్యం, 11 రూపాయల దక్షిణము, వేద పండితుడు జంధ్యాల చెంచు సుబ్బయ్య శర్మ మంత్రోచ్ఛరణతో వేద పండితులు చేతుల విూదుగా ఇరుముడిలో వేసుకొని తలపైకి ఎక్కించుకొని శివసన్నిధికి చేరుకుంటారు. స్వామివారికి ఇరుముడి సమర్పించిన తర్వాత మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవం అనంతరం, శివదీక్షను విరమిస్తారు.
0 కామెంట్‌లు