Ticker

6/recent/ticker-posts

Ad Code

మైత్రీ మూవీ మేకర్స్‌ ‘రాబిన్‌హుడ్‌’ యాక్షన్‌ షెడ్యూల్‌ Hyderabad లో ప్రారంభం

హీరో నితిన్‌ తనకు బ్లాక్‌ బస్టర్‌ ‘భీష్మ’ అందించిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న’రాబిన్‌హుడ్‌’ చిత్రంలో పూర్తిగా భిన్నమైన లుక్‌ లో అలరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న హ్యుమర్స్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ లో నితిన్‌ దొంగగా నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన క్యారెక్టర్‌ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. వెంకీ కుడుముల, నితిన్‌ పాత్రను చాలా డిఫరెంట్‌ గా ప్రజెంట్‌ చేస్తున్నారు. పాత్ర సీరియస్‌గా కనిపించినా, అతని యాక్షన్స్‌ ఫన్‌ క్రియేట్‌ అవుతుంది.తాజాగా టీమ్‌ ఇంటర్వెల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ ప్రారంభించింది. ఎప్పుడూ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో వచ్చే రామ్‌`లక్ష్మణ్‌ మాస్టర్స్‌ ఈ యూనిక్‌ యాక్షన్‌ బ్లాక్‌ని ఇంట్రస్టింగ్‌గా డిజైన్‌ చేశారు. ఇంటర్వెల్‌ లో రానున్న ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం వారు స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు.నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్‌ కోసం అద్భుతమైన స్కోర్‌ను అందించారు. సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌, రామ్‌ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌.నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తారాగణం: నితిన్‌, రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు