పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా
జగిత్యాల, మార్చి 02 (ఇయ్యాల తెలంగాణ) : జగిత్యాల జిల్లాలో ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కల మందు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఓ ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా జిల్లాలో మార్చి మూడవ తేదీ ఆదివారం నుండి పల్స్ పోరియో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు కథ 25 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వల్ల భారతదేశ నుండి పోలియో వ్యాధి పూర్తిగా నిర్మూలన జరిగిందని భారతదేశంలో చివరి పోరియో కేసులు 2011లో పశ్చిమ బెంగాల్లో నమోదయినట్లు తెలిపారు తర్వాత వరుసగా మూడు సంవత్సరాల వరకు భారతదేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు అందుకు 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం పోలియో రహిత దేశంగా గుర్తించిందన్నారు అయినా ఇప్పటికీ పక్క దేశాలైన పాకిస్తాన్ అఫ్గానిస్థాన్ లో పోలియో కేసులు నమోదవుతున్నందున భారతదేశంలో కూడా పోలియో వ్యాధి రాకుండా పల్స్ పోలియో కార్యక్రమం తప్పనిసరన్నారు జిల్లాలో 0`5 సంవత్సరాల లోపు పిల్లలు 93,832 మంది ఉన్నట్లు అంచనా జిల్లాలో అర్హులైన ఈ అందరికీ పోలియో చుక్కలు వేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందనీ గతంలో మాదిరిగానే జిల్లాలోనీ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి జిల్లాలో 0`5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి లక్ష్యాన్ని పూర్తి చేయవలసిందిగా కోరారు. మన జగిత్యాల జిల్లా పోలియో రహిత జిల్లాగా ఇలాగే శాశ్వతంగా నిలిచి మన పిల్లలను భవిష్యత్తు అంగవైకల్యం నుండి రక్షించుకోవాలంటే పోలియో చుక్కలు తప్పక వేయించాలని తెలిపారు జిల్లాలో వలస కూలీలు ఉండే ప్రాంతాలు ఇటుక బట్టీలలో పనిచేసే పిల్లలు భిక్షాటకులు ఉండే ప్రదేశాలు ఊరికి దూరంగా ఉండే వివిధ పరిశ్రమల వంటి 219 హై రిస్కీ ప్రదేశాలను గుర్తించడం జరిగిందని ఇలాంటి ప్రదేశాల్లో సుమారు 2,425 మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ఇలాంటి వారందరికీ వాక్సిన్ వేయుటకు 24 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదేశాలలోని పిల్లలు పోలియో చుక్కలు వేయించుకునే విధంగా యాజమాన్యాలు కూడా సహకరించాలని తెలిపారు ఈ జాతీయ పోలియో కార్యక్రమం ఈనెల మూడవ తేదీ నుండి 5వ తేదీ వరకు కొనసాగుతుందని మొదటి రోజు ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పల్స్ పోలియో కేంద్రాల్లో చుక్కలు వేయబడునని తర్వాత రెండు రోజులు సిబ్బంది ఎవరైతే మిగిలిపోయిన పిల్లలకు గృహ సందర్శన ద్వారా చుక్కలు వేయిదరని జిల్లాలో మొత్తం 507 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటుచేసి 2028 సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ తో పాటు స్వశక్తి సంఘాల సభ్యులు స్వచ్ఛంద కార్యకర్తలను కూడా భాగస్వాములను చేయడం జరిగిందని అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి బాధ్యత తప్పనిసరి అని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి 50 పర్యవేక్షకులను ఏర్పాటు చేయడం జరిగినదని మండల జిల్లా స్థాయి అధికారులను కూడా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ పగడ్బందీగా అమలయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు
0 కామెంట్‌లు