Ticker

6/recent/ticker-posts

Ad Code

Winter - అల్పపీడనంతో పెరిగిన చలి


హైదరాబాద్‌, జనవరి 12 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణను ఆనుకొని అధిక పీడన ప్రాంతం ఉండడం వల్ల రాష్ట్రంలో చలి పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. తెలంగాణపైకి వీస్తున్న శీతల గాలుల వల్ల చలి తీవ్రత పెరుగుతూ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రివేళ చలి అధికంగా ఉంటుండగా.. పగలు కాస్త ఎండ తీక్షణంగానే ఉంటోంది. రాబోయే రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఆదిలాబాద్‌, కుమ్రం భీం, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పొగమంచు అధికంగా ఉండనుంది. 


తెలంగాణలోని ఏ జిల్లాల్లోనూ నేడు ఎల్లో అలర్ట్‌ జారీ చేయలేదు.హైదరాబాద్‌ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో విూటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.5 డిగ్రీలుగా నమోదైంది. 78 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, ఆగ్నేయ దిశల్లో గాలులు వీయనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నట్లు చెప్పారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. 


ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా.. రాయలసీమలో కూడా వర్షాలేవిూ పడే అవకాశం లేదని తెలిపారు. కానీ, పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే  అవకాశం ఉందని, తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.‘‘ఇప్పుడు ఆ అధిక పీడన ప్రాంతం తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉంది. దీని వలన చలి తీవ్రత కాస్త పెరగనుంది. కానీ మరో వైపున కోస్తా ప్రాంతానికి బంగాళాఖాతంలో నుంచి తేమ గాలులు వీయటం వలన చలి తీవ్రత ఎక్కువగా ఉండదు. వెచ్చదనం అనేది కాస్త ఉంటుంది. మరో ఐదు రోజులు పెద్దగా చెప్పుకోదగ్గ వాతావరణ పరిస్థితులు కనబడటం లేదు’’ అని ఏపీ వెదర్‌ మ్యాన్‌ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు