‘ఊరు పేరు భైరవకోన’ ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్
హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రెండు పాటలు` నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా చార్ట్‌బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేసింది.
సందీప్ కిషన్, వర్షా బొల్లమ్మ మధ్య వండర్ ఫుల్ లవ్ కెమిస్ట్రీ తో ప్రారంభమైన ట్రైలర్ తర్వాత బైరవకోన అనే ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులని తీసుకెళ్ళింది. ‘గరుడు పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన’ అనే వాయిస్ ఇంట్రోతో భైరవకోన ఫాంటసీ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు.’’ భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం.. లిఖించబడిరదే జరుగుతుంది. రక్తపాతం జరగనీ’’. ‘’చేతికి అంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు.. చేసిన పాపాన్ని కడగడం’’అనే డైలాగ్స్ కథపై చాలా క్యురియాసిటీని పెంచాయి. సందీప్ కిషన్ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ కనపరిచారు. యాక్షన్ సీక్వెన్స్ లో ఇంటెన్స్ గా కనిపించారు. వర్షా బొల్లమ్మ పాత్ర ఆకట్టుకుంది. ఆమె ఒక యాక్షన్ సీక్వెన్ లో కనిపించడం చాలా ఆసక్తికరంగా వుంది. దర్శకుడు విఐ ఆనంద్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే ఫాంటసీ అడ్వెంచర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని ట్రైలర్ భోరోసా ఇస్తోంది. శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం విజువల్స్ ని మరింతగా ఎలివేట్ చేశాయి. రాజ్ తోట కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా వున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నతంగా వున్నాయి. వీఎఫ్‌ఎక్స్ టాప్ క్లాస్ లో ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఫాంటసీ విజువల్ వండర్ ని ప్రజెంట్ చేసిన ట్రైలర్ చిత్రంపై అంచనాలని మరింతగా పెంచింది
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందీప్ కిషన్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ముద్దు బిడ్డ, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి నేడు. ఆయన్ని స్మరిస్తూ మా ట్రైలర్ ని లాంచ్ చేశాం. దర్శకుడు విఐ ఆనంద్ గారు అనుకున్న ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని దాదాపు రెండున్నరేళ్ళు ఈ చిత్రం కోసం ఒక బాధ్యతతో పని చేశాం. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే బాధ్యత ఎంత వుందో అంతకంత నిర్మాత అనిల్ సుంకర గారికి, రాజాకి, నాకు, సినిమాలో పని చేసి అందరికీ ఈ చిత్రం పెద్ద విజయం సాధించడం మా అందరికీ చాలా అవసరం. ఆ బాధ్యతని అవసరాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ పని చేశాం. ఇందులో నిజమేనే చెబుతున్నా పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. దీనికి పూర్తి కారణం ప్రేక్షకులు ఆదరణ. చాలా గొప్పగా ఆదరించారు. ఫిబ్రవరి 9న దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్కు, మంచి హ్యుమర్, పాటలు, బోలెడంత యాక్షన్ వున్న చిత్రాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. ఊరు పేరు భైరవకోన కమర్షియల్లీ ప్యాకేజ్డ్ ఎంటర్ టైనర్. ఫిబ్రవరి 9న సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. తప్పకుండాఅందరినీ ఎంటర్ టైనర్ చేస్తుంది’’ అన్నారు
హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు విఐ ఆనంద్ గారికి ధన్యవాదాలు. సందీప్ కిషన్ అమెజింగ్ కోస్టార్. గ్రేట్ ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా గొప్పగా నిర్మించారు. శేఖర్ చంద్ర గారు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. నిజమేనే చెబుతున్న పాటకు చాలా అద్భుతమైన రీచ్ వచ్చింది. ప్రేమికులందరికీ థాంక్స్( నవ్వుతూ). ఫిబ్రవరి 9న ప్రీ వెలెంటైన్ ట్రీట్ లా ఈ సినిమాని చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమాలో ప్రేమకథ థ్రిల్ ఇస్తుంది. ఖచ్చితంగా అందరూ థియేటర్స్ లోనే చూడండి. ఇది గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మూవీ’’ అన్నారు.
హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఇంకా అద్భుతంగా అనిపించింది. ఈ చిత్రం ప్రేక్షకులకు రోలర్ కోస్టర్ రైడ్ లాటి అనుభూతిని అందిస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తుంది. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. చాలా సపోర్ట్ చేశారు. అందరూ థియేటర్స్ లో సినిమా చూడండి. తప్పకుండ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ.. ఊరు పేరు భైరవకోన నా కెరీర్ లో ఛాలెజింగ్ ప్రాజెక్ట్. ప్రతి సినిమాతో ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. ప్రేక్షకులు వారి జీవితంలో రెండున్న గంటలు సమయాన్ని కేటాయించి ఒక సినిమా చూస్తారు. వారి సమయానికి విలువ ఇవ్వాలని కోరుకుంటాను. దానికి తగిన కష్టం పడాలి. కథ స్క్రీన్ ప్లే కొత్త కంటెంట్ ప్రయత్నించాలి. ఆడియన్స్ కి కొత్త అనుభూతి ఇవ్వాలనేది నా భాద్యత. ఊరు పేరు భైరవకోన ఆడియన్స్ కొత్త అనుభూతిని, ఎక్సయిమెంట్ ని ఇస్తుంది. సందీప్ నేను కలసి జర్నీ మొదలుపెట్టాం. మాకు సపోర్ట్ ఇచ్చిన అనిల్ గారికి రాజా గారికి కిశోర్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. సినిమాలో పని చేసిన నటీనటులు, టెక్నికల్, డైరెక్షన్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కావ్య థాపర్, వర్షం చాలా అద్భుతంగా నటించారు. వీరితో పాటు చాలా మంచి స్టార్ కాస్ట్ వుంది. ఈ చిత్రం ఖచ్చితంగా ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. ఊరు పేరు భైరవకోన ప్రేక్షకులందరినీ అలరిస్తుంది. మంచి ప్రేమకథ. కామెడీ, ఫాంటసీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. రెండున్నరేళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం హార్డ్ వర్క్ చేశాం. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం. హీరో సందీప్ కిషన్, దర్శకుడు విఐ ఆనంద్, టీం అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
తారాగణం: సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ తదితరులు