బ్రోకరేజ్ సంస్థ జెఫరీన్ తన నివేదికలో అంచనా
అయోధ్య, జనవరి 23 (ఇయ్యాల తెలంగాణ) : అయోధ్య రామ మందిరం కల నెరవేరింది. జన్మస్థలంలోని నిర్మించిన ఆలయంలో మర్యాద పురుషోత్తముడు సాక్షాత్కరించాడు. ఈ క్రమంలో యావత్ భారతీయులు అయోధ్య బాల రాముడిని దర్శించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఏటా కనీసం ఐదుకోట్ల మంది పర్యాటకులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉన్నది. స్వర్ణ దేవాలయం, తిరుపతి ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్యను మించిపోతుందని బ్రోకరేజ్ సంస్థ జెఫరీన్ తన నివేదికలో అంచనా వేసింది. విమానాశ్రయం, రైల్వే తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున ఖర్చు చేయడంతో అయోధ్య దేశంలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొంది.కొత్త విమానాశ్రయం, రైల్వేస్టేషన్, రోడ్ కనెక్టివిటీ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు 10 బిలియన్లకుపైగా ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. దీంతో నగరంలో కొత్తగా హోటల్స్ ప్రారంభించడంతో ఇతర ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని.. దాంతో పాటు అయోధ్యకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతందని పేర్కొంది. భారత్‌లో ఎక్కువగా ఆలయాలను దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో భారత్‌లో మతపరమైన పర్యాటకమే అతిపెద్ద విభాగమని జెఫరీస్ పేర్కొంది.అనేక ప్రసిద్ధి చెందిన ఆధ్మాత్యిక కేంద్రాలు ప్రతి సంవత్సరం 10 నుంచి 30 మంది మిలియన్ల పర్యాటకులను ఆకర్షిస్తాయని తెలిపింది. తాజాగా కొత్తగా నిర్మించిన రామాలయంతో అయోధ్య సైతం గొప్ప పర్యాటక ప్రాంతంగా మారుతుందని పేర్కొంది. జెఫరిన్ నివేదిక ప్రకారం.. కొవిడ్‌కు ముందు అంటే 2018`19 సమయంలో పర్యాటకరంగం నుంచి జీడీపీకి 194 బిలియన్ డాలర్లు వచ్చింది. ఇది 2032`33 నాటికి ఎనిమిది శాతం వృద్ధి చెంది.. 443 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.ప్రతి యేటా అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని 3 నుంచి 3.5కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ క్షేత్రమైన తిరుపతి శ్రీవారి ఆలయాన్ని ఏటా 2.5`3కోట్ల మంది వస్తుంటారు. అలాగే వాటికన్ సిటీకి తొమ్మిది మిలియన్ల మంది పర్యాటకులు వెళ్తున్నారు. ఇక సౌదీ అరేబియాలో ఉన్న మక్కాకు ఏటా 20 మిలియన్ల మంది వచ్చి వెళ్తుంటారు. ఇక ఏటా అయోధ్యను ఐదుకోట్ల మంది పర్యాటకులు సందర్శించే అవకాశం ఉందని జెఫరిన్ అంచనా వేసింది. అయోధ్యలో కొత్త విమానాశ్రయం మొదటి దశ ప్రారంభం కాగా.. పది లక్షల ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే వీలుంటుంది.ఇక రైల్వేస్టేషన్‌ను రోజుకు 60వేల మంది ప్రయాణికులు వచ్చిపోయేలా విస్తరించారు. ప్రస్తుతం అయోధ్యలో 590 గదులతో దాదాపు 17 హోటల్స్ ఉన్నాయి. కొత్తగా 73 హోటల్స్‌ను నిర్మిస్తున్నారు. ఇండియన్ హోటల్స్, మారియట్, విందమ్ హోటల్స్ ఇక్కడ హోటల్స్‌ను నిర్మించేందుకు యూపీ సర్కారుతో ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే, ఐటీసీ సైతం అయోధ్యలో కంపెనీకి ఉన్న అవకాశాలను సైతం పరిశీలిస్తున్నది. అలాగే, ఓయో సైతం మరో వెయ్యి గదులను జోడిరచాలని ప్రయత్నిస్తున్నది. 1,200 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌ను నిర్మించాలనేది ప్రణాళిక.