Ticker

6/recent/ticker-posts

Ad Code

PSLV -C 58 విజయవంతంగా ప్రయోగం: ISRO

బెంగళూర్‌ జనవరి 1 (ఇయ్యాల తెలంగాణ ); 2024 సంవత్సరం తొలిరోజునే భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎక్స్‌పోశాట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది మరికొన్ని మిషన్లను చేపట్టనున్నది. ఇందులో కీలకమైన గగన్‌యాన్‌ మిషన్‌ సైతం ఉన్నది. గగన్‌యాన్‌తో పాటు ఈ ఏడాది 12 నుంచి మిషన్లను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. 2024 గగన్‌యాన్‌ మిషన్‌కు సన్నాహక సంవత్సరమని తెలిపారు. గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా ఇస్రో 2023లో అబార్ట్‌ మిషన్‌ నిర్వహించింది. ఈ ఏడాది మరో రెండు అబార్ట్‌ మిషన్లను నిర్వహించనున్నట్లు సోమనాథ్‌ ప్రకటించారు. రెండు మానవరహిత మిషన్లు.. హెలికాఫ్టర్‌ డ్రాప్‌ టెస్ట్‌, లాంచ్‌ ప్యాడ్‌ అబార్ట్‌ టెస్ట్‌ చేపట్టనున్నట్లు వెల్లడిరచారు. వీటితో పాటు పలు వాల్యుయేషన్‌ పరీక్షలు సైతం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ;ఈ ఏడాది జీఎస్‌ఎల్‌వీని సైతం ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ తెలిపారు. ఇన్‌శాట్‌`3డీఎస్‌, భారత యుఎస్‌ సంయుక్తంగా నిర్మించిన నిసార్‌, సెకండ్‌ జనరేషన్‌ నావిగేషన్‌ ఉపగ్రహాలను జీఎస్‌ఎల్‌వీ నింగిలోకి మోసుకెళ్లనుందని చెప్పారు. రెండు వాణిజ్య ఉపగ్రహాలను, పీఎస్‌ఎల్వీ రాకెట్‌తో పలు రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు, ఓ ఎస్‌ఎస్‌ఎల్వీ ప్రయోగం సైతం ఉంటాయని వివరించారు. స్క్రామ్‌ జెట్‌ ఇంజిన్‌ పరీక్ష, రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ టెస్ట్‌లను సైతం 2024లో నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది కనీసం 12 మిషన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హార్డ్‌వేర్‌ లభ్యతను బట్టి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోశాట్‌పై సైతం సోమనాథ్‌ స్పందించారు. ఇది ఓ ప్రత్యేక మిషన్‌ అని పేర్కొన్నారు. దీంతో కృష్ణ బిలాలపై మరింత అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఒక గతేడాది ప్రయోగించి ఆదిత్య ఎల్‌`1 జనవరి 6న ఎల్‌`1 పాయింట్‌కు చేరుకుంటుందని వివరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు