ఆ మధుర స్మృతులు - చిరకాలం నిలిచిపోతాయి : ట్విట్టర్ వేదికగా PM Modi
మంగళవారం, జనవరి 23, 2024
0
న్యూ డిల్లీ జనవరి 23 (ఇయ్యాల తెలంగాణ) : కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. బాలరాముడి రూపంలో శ్రీరాముడు అయోధ్య కు చేరాడు.. ఆ దివ్య రూపాన్ని చూసిన కోట్ల మంది భక్తులు జై శ్రీరాం అంటూ తన్మయత్వంతో పులకించిపోయారు. సోమవారం పండితులు నిర్ణయించిన దివ్య ముహూర్తాన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ప్రధాని మోదీ మంగళవారం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో మనం ఏం చూశామో.. ఆ మధుర స్మృతులు చిరకాలం నిలిచిపోతాయి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది.సోమవారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల విూదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు దీరారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో అయోధ్యాపురి విద్యుత్ కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది.
Tags