IRAN పై ప్రతీకార దాడికి దిగిన Pakistan
గురువారం, జనవరి 18, 2024
0
న్యూ డిల్లీ జనవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని పాక్ తీవ్రంగా ఖండిరచింది. తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ దిశగా చర్యలు తీసుకుంది.ఇరాన్‌పై గురువారం ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్ భూభాగంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో గల సరవన్ నగరానికి సవిూపంలో ఉన్న ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్’, ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ స్థావరాలపై పాక్ గురువారం వైమానిక దాడులు చేసినట్లు స్థానిక విూడియా వెల్లడిరచింది.పాకిస్థాన్‌లోని జైష్`అల్`అదల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి దాడికి దిగింది. అయితే ఇరాన్ దాడులను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండిరచింది. దాడిలో ఇద్దరు అమాయక పిల్లలు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని వెల్లడిరచింది. ఇది పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే నని, ఈ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.
Tags