విభజన హామీలను అమలు చేసే వరకు ఉద్యమిస్తాం : Chandragiri
ఆదివారం, జనవరి 21, 2024
0
హైదరాబాద్,జనవరి 21 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను అమలు చేసే వరకు ఉద్యమిస్తామని రాష్ట్ర ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాదక్షులు చంద్రగిరి సత్యనారాయణ పేర్కొన్నారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన హామీల అమలు- కేంద్ర ప్రభుత్వ వివక్షతపై నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు చంద్రగిరి సత్యనారాయణ తన నాయకుల బృందంతో కోదండరామ్ ని కలసి సంఘీభావం తెలపనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరణ చేయటంలో చూపిస్తున్న శ్రద్ధ రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరణ చేసి దేశంలో ఎస్సీ రిజర్వేషన్లు లేకుండా కుట్ర చేస్తు నిరుద్యోగ సమస్యలను పెంచి పోషిస్తున్నారన్నారు. విభజన హామీలను వెంటనే అమలు చేయకపోతే పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల ఉపకులాల నాయకులు సమగర శివ శంకర్, శివ మాన్కార్,శ్రీనివిస్, బలరాం, సల్లా సతీష్, సాయులు , మారుతీ, కేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags