Ticker

6/recent/ticker-posts

Ad Code

దళితవాణి - Calendar ని ఆవిష్కరించిన MLA వివేక్ వెంకట స్వామి


హైదరాబాద్, జనవరి 01 (ఇయ్యాల తెలంగాణ) దళితవాణి జాతీయ వారపత్రిక 2024 సంవత్సర క్యాలెండర్ ను చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దళితవాణి గత పన్నెండు సంవత్సరాలుగా  చేస్తున్న కృషిని కొనియాడారు. దళితవాణి ప్రతినిధుల బృందం  ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.    కొత్త సంవత్సరంలో కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వం బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని దళితవాణి  ప్రతినిధుల బృందం ఎమ్మెల్యేని కోరారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల సంఘాల సీనియర్ నాయకులు చెన్నయ్య దళితవాణి ప్రతినిధుల బృందం సభ్యులు తోటకాడి రమేష్ బాబు, పేరోజు మహేష్,సత్యనారాయణ,భుజేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు