సో - కాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చిన Anganwadi లు
గురువారం, జనవరి 18, 2024
0
ఆళ్లగడ్డ, జనవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : ఆళ్లగడ్డ ప్రాజెక్టు పరిధిలోని ఆరు మండలాల అంగన్వాడి టీచర్లు ఆయాలు సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నాడు సిడిపిఓ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి విజయ్ కుమార్ గారికి వ్రాతపూర్వంగా షో కాజు నోటీసులకు సమాధానం ఇచ్చారు. గత నెల 12వ తేదీ నుండి తమ వేతనాల కోసం చేస్తున్న సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆళ్లగడ్డ ప్రాజెక్టు ద్వారా, వీఆర్వోల ద్వారా అంగన్వాడి సెంటర్ల వద్ద నోటీసులు అతికించడం , ఇండ్ల వద్ద నోటీసులు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా ప్రభుత్వం పంపిన నోటీసుల్లో ప్రభుత్వం పొందుపరిచినటువంటి అంగన్వాడీలు విధులను, బాధ్యతలను విస్మరించి ఉద్యోగ బాధ్యతలను నిర్వహించలేదననే ఆరోపణ పూర్తి అవాస్తవం అని, లబ్ధిదారులకు నేరుగా అంగన్వాడీలు అసౌకర్యం కల్పించారని ఆరోపణ కూడా పూర్తి అవాస్తవమని, హావిూ ఇచ్చి అమలు చేయకుండా ప్రభుత్వమే మోసం చేసిందని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమార్లు నిత్యావసర వస్తువులు, పెట్రోల్ గ్యాస్, కరెంట్ బిల్లులు మొదలు వాటి పెంచి మాపై బారాలు మోపిందని, పెరిగిన ధరల కన్నుమూలంగా మా వేతనాలు పెంచమని అనేకమార్లు ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా ప్రభుత్వానికి విన్నవించుకున్న పరిష్కరించలేదని, మా పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన నందు వల్లనే గత్యంతరం లేక మేము సమ్మె బాట పట్టామని, ఇప్పటికైనా ప్రభుత్వం మాతో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించి మాకు న్యాయం చేయాలని, సోకజ్ నోటీసుల పేరుతో మా విధుల పైన ఎలాంటివిచారణ చేయకుండానే మాపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్న చెల్లవని, న్యాయం జరిగేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుందని తెలియజేస్తూ సో కాదు నోటీసు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ, రుద్రవరం,, సిరివల్ల, చాగలమర్రి, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల అంగన్వాడి యూనియన్ నాయకురాళ్ళు రాజ్యలక్ష్మి, మనోజ,, లక్ష్మి సుధా మనీ, పద్మ, ఉదయలక్ష్మి, మాధవి, రాజేశ్వరి, నారాయణమ్మ, రాఘవేంద్రమ్మతోపాటు సిఐటియు జిల్లా కార్యదర్శి ల. బాల వెంకట్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రుడు, సిఐటియు నాయకులు రమేష్ ప్రాజెక్టు పరిధిలోని టీచర్లు , ఆయాలుఅందరూ పాల్గొన్నారు.
Tags