Ticker

6/recent/ticker-posts

Ad Code

Telugu` Tamil ద్విభాషా చిత్రం ‘శబ్దం’ ఫస్ట్‌లుక్‌ "

 నేచురల్‌ స్టార్‌ నాని లాంచ్‌ చేసిన ఆది పినిశెట్టి, అరివళగన్‌, 7ఉ ఫిల్మ్స్‌, ఆల్ఫా ఫ్రేమ్స్‌ తెలుగు`తమిళ ద్విభాషా చిత్రం ‘శబ్దం’ ఫస్ట్‌లుక్‌


 ‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్‌ సూపర్‌నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7ఉ ఫిల్మ్స్‌ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్‌ బానుప్రియ శివ సహనిర్మాత.ఆది పినిశెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్‌ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. నేచురల్‌ స్టార్‌ నాని పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. హీరో కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్‌ చేస్తూ కనిపిస్తుండగా, అనేక పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. స్పోర్ట్స్‌ కళ్ళ జోడు ధరించి ఆది స్పాట్‌లో కెమెరా, ఫ్లాష్‌లైట్‌లను గమనించడం ఫస్ట్‌ లుక్‌ లో ఆసక్తికరంగా వుంది. ఈ టెర్రిఫిక్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని కమరింతగా పెంచింది.దర్శకుడు అరివళగన్‌, హీరో ఆది, సంగీత దర్శకుడు తమన్‌ ఎస్‌ ఈ సినిమా కోసం మళ్లీ కలిశారు.


‘వైశాలి’ లో చాలా రైన్‌ బేస్డ్‌ సన్నివేశాలు ఉండగా, శబ్దం సినిమాలో చాలా సన్నివేశాలు పర్వతాలు,  పర్యాటక ప్రదేశాలలో చిత్రీకరించారు. అలాగే ఈ సినిమాలో సౌండ్‌కి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు వుంటాయి.ముంబయి, మున్నార్‌,  చెన్నైలోని అనేక ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. కేవలం ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ కోసమే 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించారు. సంగీత దర్శకుడు థమన్‌ సినిమా కోసం ప్రత్యేకమైన సౌండ్‌ ఎఫెక్ట్స్‌ ,ఆర్‌ఆర్‌ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారు.సిమ్రాన్‌, లైలా, లక్ష్మీ విూనన్‌, రెడిన్‌ కింగ్స్లీ, ఎం.ఎస్‌. భాస్కర్‌, రాజీవ్‌ విూనన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ చిత్రానికి అరుణ్‌ పద్మనాబన్‌ డీవోపీగా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సాబు జోసెఫ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు. మనోజ్‌ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌.

తారాగణం: ఆది పినిశెట్టి, సిమ్రాన్‌, లైలా, లక్ష్మీ విూనన్‌, రెడిన్‌ కింగ్స్లీ, ఎం.ఎస్‌. భాస్కర్‌, రాజీవ్‌ విూనన్‌

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు