హైదరాబాద్ డిసెంబర్ 14 (
ఇయ్యాల తెలంగాణ) : ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేయమని ముందే చెప్పామని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సందర్భంగా అసెంబ్లీ విూడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యేలందరూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు ప్రమాణం చేశామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటిలతో అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారన్నారు. ఇచ్చిన గ్యారెనీటీలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా? లేక ఇటలీ నుంచి తెస్తారా...? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హావిూలను వెంటనే అమలు చేయాలని.. ఆ పార్టీపై తమ యుద్ధం మొదలైందని రాజసింగ్ పేర్కొన్నారు.అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హావిూలు నెరవేర్చాలని, హావిూల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని వ్యాఖ్యానించారు. మహేశ్వర్ రెడ్డి ప్రగతి భవన్‌ను స్టడీ సర్కిల్‌గా మారుస్తామని హావిూ ఇచ్చి మరిచారన్నారు. రైతు బంధులో కోత విదించడం సరైంది కాదన్నారు.
0 కామెంట్‌లు