Red Cross ఆద్వర్యం లో వృద్ధులు, వికలాంగులకు మెడికల్ Health క్యాంప్
శుక్రవారం, డిసెంబర్ 15, 2023
0
హైదరాబాద్ డిసెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ) : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ హెల్త్ క్యాంప్ కన్వీనర్ డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో సికింద్రాబాద్, వారసిగుడ లోని ఇందిరా నగర్ కమ్యూనిటీ హాల్లో మొదటి అంతస్తు లో నమ్రత జస్వాల్,అమన్ వేదిక సహకారంతో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు వికలాంగులకు, తెలంగాణ ప్రభుత్వ వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న మొబైల్ మెడికేర్ యూనిట్ (ఓఓఙ) లో భాగంగా మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి విచ్చేసి పేషెంట్లకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. రవి హీలియస్ హాస్పిటల్ ఎండి డా. బి. విజయ్ భాస్కర్ గౌడ్ పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యులు పి జ్యోతి, ఏఎన్ఎం అనిత, సైకాలజిస్ట్ జగన్నాథం ప్రవీణ్, అమన్ వేదిక సిబ్బంది మాయ బ్రహ్మ ,కళావతి, రైజా, స్వప్న, నాగభూషణం, రెడ్ క్రాస్ వాలంటీర్లు ఎస్ ఎం ప్రగతి, షబానా, రూప, వెంకట్, ఫార్మసిస్ట్ ఏపీ లక్ష్మి, సందీప్, గోపాల్, మురళి తదితరులు పాల్గొన్నారు.
Tags