Ticker

6/recent/ticker-posts

Ad Code

January 6 వరకు 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ

 సికింద్రాబాద్‌ 27 (ఇయ్యాల తెలంగాణ ):కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ రేపటి నుండి ప్రారంభమై జనవరి 6 వరకు జరగనున్నట్లు కంటోన్మెంట్‌ అధికారులు తెలిపారు .. ఇందుకు సంబంధించి వార్డువారిగా నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు దరఖాస్తులు ఇవ్వనున్నట్లు తెలిపారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసినందుకు ప్రభుత్వం తరపున కార్యాచరణ రూపొందించినట్లు


కంటోన్మెంట్‌ సీఈవో మధుకర్‌ నాయక్‌ స్పష్టం చేశారు.. కంటోన్మెంట్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 6 గ్యారంటీ ఇలా దరఖాస్తు ఫారాలను కంటోన్మెంట్‌ కార్యాలయంలో ఆర్డిఓ రవి, నందిత ఆధ్వర్యంలో విడుదల చేశారు.. అనంతరం దరఖాస్తులలో పొందుపరిచిన ఆరు గ్యారంటీలకు సంబంధించి అధికారులు కంటోన్మెంట్‌ నాయకులకు అవగాహన కల్పించారు.. 6 గ్యారంటీలలో రైతు భరోసా పథకం మినహా మిగిలిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు వార్డుల వారీగా ఇవ్వనున్నట్లు వెల్లడిరచారు.. కంటోన్మెంట్‌ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి వార్డుకు నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి కుటుంబానికి ఒక దరఖాస్తు ఇచ్చేందుకు ప్రణాళిక పేర్కొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు