హైదరాబాద్, డిసెంబర్ 14 (ఇయ్యాల తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2023 పోటీల్లో గౌలిపుర మిత్ర బాక్సింగ్ క్లబ్ బాక్సర్ లు పలు మెడల్స్ అందుకొని భేష్ అనిపించుకుంటున్నారు. గత 8 సంవత్సరాలుగా పాతబస్తీ గౌలిపురాలోని మిత్ర క్లబ్ లో నిత్యం శిక్షణ పొందుతూ గోల్డ్ మెడల్ ను సాధించగలిగారు. తెలంగాణ కోచ్ బొల్లారం ఉదయ్ కుమార్ నేతృత్వంలో సహాయ కోచ్ పాసుల సోను టీమ్ కో- ఆర్డినేటర్ సంఘీ మహేష్ బాబు పర్యవేక్షణలో నిత్యం శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థుల్లో పతంగే గుణ నిధి గోల్డ్ మెడల్ ను సాధించారు. అదేవిధంగా ముల్ నాగి నర్మదా గోల్డ్ మెడల్ ను కైసవం చేసుకుంది.
లష్కర్ వైభవ్ సిల్వర్ మెడల్ ను సాధించాడు. మిత్ర బాక్సింగ్ క్లబ్ నుంచి బంగారు, వెండి పతకాలను సాధించిన బాక్సర్ లను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఇందులో భాగంగా ఛత్రినాక ఏసీపీ జి. రమేష్, గౌలిపురా మాజీ కార్పొరేటర్ ఆలే జితేంద్ర బాక్సర్ లను శాలువతో సత్కరించారు. మున్ముందు మరిన్ని మెడల్స్ సాధించడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.
7 వ ఉన్నత స్థాయి జాతీయ ఛాంపియన్ షిప్ బాక్సింగ్ పోటీల్లో భాగంగా డిసెంబర్ 21 మరియు 27 వ తేదీల్లో జరుగనున్న జాతీయ పోటీలకు మిత్ర బాక్సింగ్ క్లబ్ బాక్సర్ లు పాల్గొననున్నారు. ఉత్తర ప్రదేశ్ గ్రేటర్ నోయిడా లోని GBU ఇండోర్ స్టేడియమ్ లో జరుగనున్న జాతీయ ఎలైట్ వుమెన్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడానికి మిత్ర బాక్సింగ్ క్లబ్ లోని బాక్సర్ లు సిద్ధమవుతున్నారు. జాతీయ స్థాయిలో రాణించి తెలుగు రాష్ట్రానికి వన్నె తేవాలని పలువురు ప్రముఖులు సూచనలు చేస్తున్నారు. కోచ్ బొలారం ఉదయ్, సబ్ కోచ్ సోను టీమ్ కో-ఆర్డినేటర్ మహేష్ బాబు తమ టీమ్ రాణించాలంటూ నిరంతరం ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.
ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న మిత్ర బాక్సింగ్ క్లబ్ బాక్సర్లు
0 కామెంట్‌లు