👉 మహిళలు సద్వినియోగం చేసుకోవాలని విన్నపం -
👉 విశ్వహిందూ పరిషత్ సభ్యులు మారుతి మోహన్
కౌతాళం,డిసెంబర్ 21 (ఇయ్యాల తెలంగాణ) : ఉచిత టైలరింగ్ ఎంబ్రాయిడరీ శిక్షణ కార్యక్రమానికి తల్లిదండ్రులు అమ్మాయిలను మహిళలను ప్రోత్సహించి సహకరించాలని విశ్వహిందూ పరిషత్ సభ్యులు మారుతి మోహన్ ఎంపీడీవో సుబ్బరాజుపేర్కొన్నారు గురువారం మధు ఉచిత కుట్టు మిషన్ ప్రారంభోత్సవం జరిగినది. ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పిటిసి కృష్ణంరాజు ట్రస్టు సభ్యులు రామలింగప్ప ,అరుణకుమారి ఎంపీడీవో సుబ్బరాజు, వైసిపి నాయకులు గురు రెడ్డి, హాజరయ్యారు ముందుగా సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో పేద మహిళలు, అమ్మాయిలు , కుట్టు మిషన్ ఎంబ్రాయిడరీ మూడునెలల వరకు ఉచితంగా నేర్చుకుని వారి కుటుంబ పోషణకు దోహదపడాలని కోరారు. ప్రతి ఒక్కరు సహకారంతో ముందుకు రావాలని, తాము స్వయం శక్తిగా ఎదగాలని సూచించారు. ఎకల్ గ్రమోర్ధన్ వారికికృతజ్ఞతలు తెలపాలని కోరారు.ఈ కార్యక్రమంలో, మాజీ ఎంపీటీసీ చౌదరి బసవ ,కృష్ణ చైతన్య, వెంకటేష్ , బద్రి మరియు మహిళలు అమ్మాయిలు, తదితరులు ప్రారంబొత్సవం లొ పాల్గోన్నారు.