భారీగా తగ్గిన Chi ken ధరలు
మంగళవారం, డిసెంబర్ 12, 2023
0
హైదరాబాద్, డిసెంబర్ 12, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో ఎన్నికల ముగియడం, కార్తీక మాసం ప్రభావంతో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. రెండు నెలల క్రితం రూ.300 వరకు పలికిన చికెన్ ధరలు సగానికి తగ్గాయి.చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కార్తీక మాసం ఎఫెక్ట్ తో చికెన్ ధరలు పడిపోయాయి. ఇటీవల వరకు ఎన్నికల హాడావుడితో ధరలు పెరిగినా...మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండడంతో చికెన్ ధరలు సగానికి తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం కిలో చికెన్ ధర స్కిన్ రూ.138, స్కిన్ లెస్ రూ.157 పలుకుతోంది. అయితే ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల కారణంగా నవంబర్ కిలో చికెన్ ధర రూ.200 వరకు పలికింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం మాంస ప్రియులు చికెన్ కు దూరంగా ఉంటున్నారు. రెండు, మూడు నెలల క్రితం కిలో రూ.300 దాటిన చికెన్ ధరలు...ఇప్పుడు అమాంతం తగ్గిపోయాయి. కిలో చికెన్ ధర 120 నుంచి 140లకు పడిపోయింది. దీంతో మాంసం ప్రియులు పండుగ చేసుకుంటున్నారు.
కిలో తీసుకునే బదులు రెండు మూడు కిలోలు చికెన్ వంటకాలు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చికెన్ ధరలు భారీగా తగ్గడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం మేత పెట్టుబడి రావడంలేదని వాపోతున్నారు. ఎన్నికలు, న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకుని లక్షల్లో పెట్టుబడులు పెట్టిన పౌల్ట్రీ రైతులు నష్టాలను చూస్తున్నారు. ఒక్కసారిగా రేటు పడిపోవడంతో కనీసం గిట్టుబాటు ధరలు రావడంలేదంటున్నారు.వారంలో కార్తీక మాసం పూర్తి కావడంతో పాటు, క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు ఉండడంతో చికెన్ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
మరో పదిహేను రోజుల్లో కోళ్ల రేట్లు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. పౌల్ట్రీ రైతుల వద్ద కోళ్లు భారీగా ఉండడంతో చికెన్ కేంద్రాలకు కోళ్లను విక్రయిస్తున్నారు. కోళ్లను ఫారాల్లో ఎక్కువ రోజులు పెంచితే మేత ఖర్చుతో పాటు, వాటికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పౌల్ట్రీ రైతులు కోళ్లను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. మార్కెట్లోకి భారీగా కోళ్లు రావడంతో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ నెలాఖరులో చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. జనవరిలో సంక్రాంతి పండుగకు చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలో కూడా చికెన్ ధరలు భారీగా తగ్గాయి. పలు జిల్లాల్లో కిలో చికెన్ ధరలు రూ.140 నుంచి రూ.150 వరకు ఉన్నాయి
Tags