హైదరాబాద్, డిసెంబర్ 7 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటి స్పీచ్ ఇచ్చారు. ముందుగా జై తెలంగాణ.. జై సోనియమ్మ అనే నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఆశామాషీగా ఏర్పడిరది కాదు అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం అనేక పోరాటాలతో, అమరవీరుల త్యాగాల పునాది విూద, ఎన్నో ఆకాంక్షలు, ఆశలతో ఏర్పాడిరదని ప్రజలకు తెలిపారు. రాష్ట్ర అభివృద్దిలో విూ ఆలోచనలను పంచుకోవచ్చన్నారు. తెలంగాణను సంక్షేమ, అభివృద్ది రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత విూ రేవంత్ రెడ్డిది అన్నారు.ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను బద్దలుకొట్టినామన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్?గా పేరుమార్చి ప్రజాదర్భార్ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికి కృషి చేస్తానన్నారు. నగరంలోని శాంతి భద్రతలను కాపాడుతూ దేశంలోనేకాదు ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్?గా చేస్తానన్నారు
.