వరంగల్ డిసెంబర్ 22 (ఇయ్యల తెలంగాణ );ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కరోనా కేసు నిర్ధారణ అయింది. రోగి ప్రస్తుతం ఆక్సిజన్ సహాయంతో ఎంజీఎం కరోనా వార్డులో చికిత్స పొందుతున్నారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీ నగర్కు చెందిన 62 సంవత్సరాల మహిళ నిమోనియా ఒబేసిటీతో బాధపడుతూ హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. ఇక్కడ ఆర్. టి. పి. సి. ఆర్ పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్గా నిర్ధారణ అయింది. రోగిని వెంటనే ఎంజి ఎం కు తరలించారు. ప్రస్తుతం రోగి ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందుతుంది. రోగి నుండి మరో రెండు శాంపిల్స్ సేకరించారు. వెరియంట్ నిర్ధారణ కోసం ఒకశాంపిల్ ను పూణేకు పంపారు. మరో షాంపిల్ ను కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని వైరాలజీ ల్యాబ్ కు ఆర్. టి. పి. సి. ఆర్ నిర్ధారణ కోసం పంపారు. రోగి కూతురు కొడుకు సాంపిల్స్ కూడా సేకరించారు.రోగి నిమోనియా,ఓబేసిటీ,బిపి తో బాధపడుతున్నట్లు ఎంజీఎం వైద్యులు వెల్లడిరచారు. ప్రస్తుతం ఆక్సిజన్ సహాయంతో శ్వాస తీసుకుంటుందని యాంటీ వైరల్, యాంటీబాక్టీరియల్ చికిత్స అందిస్తున్నట్లువైద్యులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో కరోనా కేసు అప్రమత్తమమైన ఆరోగ్యశాఖ
శుక్రవారం, డిసెంబర్ 22, 2023
0
Tags