తాడేపల్లిగూడెం,(ఇయ్యాల తెలంగాణ ); పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎన్‌ఐటీ కి చెందిన ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ విజయవాడ నుంచి వస్తుండగా ఏలూరు దాటిన తర్వాత ఈ ప్రమాద సమాచారంతెలియగానే ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా హుటాహుటిన ఆసుపత్రికి తరలివచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఎన్‌ఐటి విద్యార్థులను పరామర్శించారు. ప్రమాదంగురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఖర్చుకు వెనకాడకుండా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే వేరే ఆసుపత్రులకుతరలించాలని, వైద్య నిపుణులను రప్పించాలని డిప్యూటీ సీఎం కొట్టు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిగూడెం మామిడాల చెరువు ప్రాంతానికి చెందిన ఆదిత్య అనే కార్ డ్రైవర్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడేమృతి చెందారు. ఆ కారులో ప్రయాణిస్తున్న ఏపీ ఎన్ ఐ టి లో చదువుతున్న గుంటూరు కు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థి గాజులపాటి హర్షవర్ధన్ చందు, అనంతపురం జిల్లా తాడిపత్రి కి చెందిన థర్డ్ ఇయర్విద్యార్థి పెనుకుమాడు విష్ణువర్ధన్, నిడదవోలుకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి జగత శ్రీనివాస్, గుంటూరు బుర్రిపాలెం ప్రాంతానికి చెందిన సాత్విక్, నెల్లూరుకు చెందిన సెకండియర్ విద్యార్థి నవీన్ కుమార్,గుంటూరుకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి నంబూరు ఈశ్వర్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు.వీరిలో తలకు తీవ్ర గాయమైన నవీన్ కుమార్ ను మరింత మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు.వీరంతా కారులో వెళుతుండగా తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్ లో హైవేపై కమ్మ కళ్యాణ మండపం సవిూపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. అయితే వీరంతా అటువైపునకుఎందుకు వెళ్తున్నారని వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏపీ ఎన్‌ఐటి విద్యార్థులను తొలుత తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరంమెరుగైన వైద్యం కోసం పట్టణంలోని యూనియన్ హాస్పిటల్స్ కు తరలించారు. అవసరమైన వారికి యుద్ధ ప్రాతిపదికన ఎక్స్రేలు, స్కానింగ్ తీయించి యూనియన్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ తోపరాల కళ్యాణచక్రవర్తి ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. సమాచారం తెలియగానే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్లారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి కొట్టు ఆదేశించారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని డిప్యూటీసీఎం కొట్టు సత్యనారాయణ ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎవరికి ప్రాణాపాయం లేదని, వారికి అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, వారుకోలుకునేంత వరకు నిరంతరం పర్యవేక్షిస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలియజేశారు.
0 కామెంట్‌లు