ఖమ్మం నవంబర 9 (ఇయ్యాల తెలంగాణ );మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు.ఖమ్మంలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎనిమిది వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారులు మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సోదాలకు ఐటీ, ఈడీ అధికారులు రావడం గమనార్హం.
మా జీ MP పొంగులేటి ఇంట్లో ED, ITసోదాలు
గురువారం, నవంబర్ 09, 2023
0
Tags