హైదరాబాద్ నవంబర్ 2 (ఇయ్యాల తెలంగాణ ):హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే లక్ష్మారెడ్డి సహా పులవురు ఆ పార్టీకి చెందిన నేతల ఇండ్లలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాలాపూర్‌లోని పారిజాత నివాసంలో గురువారం ఉదయం 5 గంటల నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆమె మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన విషయం తెలసిందే. ఎమ్మెల్యే టికెట్ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కోట్లలో డబ్బులు ముట్టజెప్పానంటూ ప్రకటించిన సంగతి విధితమే.కాగా, మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేఎల్‌ఆర్ నివాసంపై కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అదేవిధంగా బాలాపూర్ గణేశ్ లడ్డూను దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అదే నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతల ఇండ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
0 కామెంట్‌లు