Ticker

6/recent/ticker-posts

Ad Code

ఇండోనేషియాలో భూకంపం

జకార్తా, నవంబర్‌ 8, (ఇయ్యాల తెలంగాణ );ఇండోనేషియాలో భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి. సౌలంకి సిటీలో భూమి ఒక్కసారిగా కంపించింది.  రిపోర్ట్‌ ప్రకారం..రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఎంత మంది చనిపోయారు..? ఎంత మంది గాయపడ్డారు..? అన్న వివరాలు ఇంకా తెలియలేదు. ఇవాళ ఉదయం 10.23 గంటలకు బండా సముద్రంలో  ఈ ప్రకంపనలు నమోదయ్యాయని   వెల్లడిరచింది. అయితే ఈ భూప్రకంపనల నేపథ్యంలో  సునావిూ హెచ్చరికలు మాత్రం చేయలేదు. ఇండోనేషియాలోని అంబాన్‌కి ఆగ్నేయ దిశలో 370 కిలోవిూటర్ల మేర ఈ ప్రభావం కనిపించింది. 146 కిలోవిూటర్ల లోతు వరకూ ప్రకంపనలు నమోదయ్యాయి. సౌలంకి పరిసర ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్‌ ఎక్కువగా కనిపించింది. ‘‘భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఇక్కడి పౌరులు ధైర్యంగానే ఉన్నారు. ఇక్కడ భూకంపాలు సాధారణమైపోయాయి. పైగా సునావిూ హెచ్చరికలు ఏవిూ లేవు. అందుకే అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికైతే ఏ ఇబ్బందీ లేదు’’ఇండోనేషియాలో భూకంపాలు చాలా సాధారణం. అందుకే దీన్ని ఖజీఞతిటతిఞ ఖీతినిణ నీట ఈతితీవ గా పిలుస్తారు. జపాన్‌ భౌగోళిక పరిస్థితులు ఇండోనేషియాపై ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే..ఇక్కడ తరచూ భూకంపాలు నమోదవుతుంటాయి. గతేడాది నవంబర్‌లో చివబబి ఏజీలజీ ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది. ఆ సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.6గా నమోదైంది. ఆ సమయంలో భూకంప ధాటికి 602 మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లోనూ సుమత్రా తీర ప్రాంతంలో 9.1 మ్యాగ్నిట్యూడ్‌తో భూమి కంపించింది. ఆ ధాటికి 2లక్షల 20 వేల మంది మృతి చెందారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు