Ticker

6/recent/ticker-posts

Ad Code

ఫ్లై ఓవర్‌ రైలింగ్‌ ను ఢీకొట్టిన కంటైనర్‌

శ్రీకాకుళం నవంబర్ 8 (ఇయ్యాల తెలంగాణ); శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్ము జంక్షన్‌ సవిూపంలోని 16 వ నెంబర్‌ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఒక కంటైనర్‌  ఫ్లైఓవర్‌ రైలింగ్‌ ను డీ కొట్టింది. ప్రమాదంలో రైలింగ్‌ యొక్క సిమెంట్‌ దిమ్మలు క్రిందకు పడిపోగా ఎలక్ట్రికల్‌  పోల్‌ పూర్తిగా క్రిందకు వాలిపోయింది. డ్రైవర్‌ కు బీపీ పెరగడంతో  సంఘటన జరిగినట్టు  క్లీనర్‌ చెబుతున్నారు. రోడ్‌ పై ప్రమాదం జరగడంతో వాహనాలను జాతీయ రహదారి నుండి వేరే మార్గంలో  వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు