రంగారెడ్డి నవంబర్ 1 (ఇయ్యాల తెలంగాణ ); ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు బుధవారం బీఆర్‌ఎస్ లో చేరారు.విూడియాతో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. మాతో కలిసి పని చేశాడు. సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చాం. కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడు. ముక్కు సూటి తత్వం ఉన్న మనిషి. రెండు సార్లు టికెట్ ఇచ్చాం. స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 11 మంది కార్పొరేటర్లు గెలిపించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి భంగపడ్డారు. రామ్మోహన్ గౌడ్ కు బిఆర్‌ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుంది. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయి. పార్టీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అందుకు నేను బాధ్యత తీసుకుంటాను. మన ఇంటి సమస్య మనం పరిష్కరించకుందాం.కాంగ్రెస్ గెలిచేది లేదు. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారు. అన్ని సర్వేలు బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయి. హైకమాండ్ ఢల్లీిలో ఉండే పార్టీ కావాలా, గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు.
0 కామెంట్‌లు