Ticker

6/recent/ticker-posts

Ad Code

అభ్యర్థుల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్‌, నవంబర్‌ 2 (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. పోటీ చేసే అభ్యర్థులకు ఎలక్షన్‌ కమిషన్‌ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన కొందరిపై వారి ప్రత్యర్థులు నియమావళిని పాటించలేదని ఆరోపిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిని విడుదల చేసింది. అభ్యర్థులు నామినేషన్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో పొందుపరిచింది.

అభ్యర్థి.. ఈ నిబంధనలు తప్పనిసరి పాటించాలి;  నామినేషన్‌ వేసే అభ్యర్థి గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీకి చెందిన వారైతే సదరు అభ్యర్థిని అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. గుర్తింపు పొందని పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే పక్షంలో అదే నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి.         ఓటు హకు ఉన్న నియోజకవర్గం నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే తనకు ఓటు హకు ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి ఒకో అభ్యర్థి ఒకో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయొచ్చు.ఎన్నికలకు సంబంధించిన ప్రతి పైసా ఈ ఖాతా నుంచే ఖర్చు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో జాయింట్‌ అకౌంట్‌ తెరవొద్దు. అభ్యర్థి ఒకరి పేరుతో మాత్రమే ఖాతా ఉండాలి ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఆయా వర్గాలకు చెందిన వారై ఉండాలి. ఈ మేరకు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ప్రజాప్రాతినిధ్య చట్టం`1951లోని సెక్షన్‌ 4, 5 ప్రకారం జనరల్‌ క్యాటగిరీ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయొచ్చు.         అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలైతే రూ.5 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలి నామినేషన్‌ సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్‌ సమర్పించాలి. అందులో అభ్యర్థి ఆస్తులు, అప్పులు, కేసులు వంటి అన్ని వివరాలూ ఉండాలి నామినేషన్‌ సమయంలో రిటర్నింగ్‌ అధికారి అడిగే ఏ ధ్రువపత్రాన్నైనా సమర్పించలేని పక్షంలో వాటిని అందించేందుకు తుది గడువు వరకు సమయం ఉంటుంది  నామినేషన్లు వేసేటప్పుడు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి 100 విూటర్ల పరిధిలోపు ఊరేగింపులకు అనుమతి ఉండదు. ఆ 100 విూటర్ల దూరంలోకి 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.         రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి అభ్యర్థి సహా ఐదుగురు మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుంది.  నామినేషన్‌ పరిశీలించేటప్పుడు అభ్యర్థి, ఎలక్షన్‌ ఏజెంట్‌, అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తుల్లో ఒకరు, మరొక వ్యక్తి ఎవరైనా వెళ్లొ చ్చు. న్యాయవాదిని కూడా తీసుకెళ్లవచ్చు.         అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే, అర్హత నిర్ణయించే అధికారం రిటర్నింగ్‌ అధికారికి మాత్రమే ఉంటుందిఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతిపాదించే వ్యక్తులు లేకపోతే వారి నామినేషన్‌ తిరసరణకు గురవుతుంది. అలాగే ప్రతిపాదించే వ్యక్తులకు అభ్యర్థి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓటు హకు లేకపోయినా వారి ప్రతిపాదన చెల్లదు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు