Ticker

6/recent/ticker-posts

Ad Code

నా ఓటు లక్ష

ఖమ్మం నవంబర్ 3 (ఇయ్యాల తెలంగాణ ):నా ఓటు లక్ష అంటూ ఖమ్మం లో  ప్లకార్డు పట్టుకొని తిరుగుతున్నాడు ఓ వృద్దుడు. ఖమ్మం నగరంలో ఓ వృద్ధుడు వినూత్నంగా  నిరసన తెలుపుతుండడముతో ఖమ్మం నగర వాసులు  ఆసక్తిగా చూస్తున్నారు. నగరానికి చెందిన వెంకట సుబ్బారావు అనే వృద్దుడు నా ఓటు లక్ష కు అమ్ముతానని అమ్మగా వచ్చిన డబ్బులు బ్యాంకులో ఫిక్సెడ్‌ చేసి నెల నెలా వచ్చే డబ్బులతో అనాధలకు అన్నం పెడతానని అంటున్నాడు. ఓటు డబ్బుతో ముడి పడి ఉన్నదని ఓటుని ఎవరు సరిగా ఉపయోగించు కోవడం లేదని అందరూ అమ్ముకుంటున్నారని అంటున్నారు. ఖమ్మం నగరం లో ఉన్న  సమస్యలను అధికారుల దృష్టికి తీసుక పోవడానికి ప్లాకార్డ్‌ లు విూద సమస్యలు రాసి నగరంలో తిరుగుతుంటాడు అని స్థానికులు అంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు