ఢల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం
శుక్రవారం, నవంబర్ 03, 2023
0
న్యూఢల్లీ నవంబర్ 3 (ఇయ్యాల తెలంగాణ ):దేశ రాజధాని ఢల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. పెపెచ్చు చలికాలం మొదలు కావడంతో ఢల్లీి వాసులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. కాలుష్యం పెరగటంతో శుక్రవారం నుంచి ప్రైమరీ క్లాసులకు సెలవులు ప్రకటించారు. ఆన్లైన్లో క్లాసులు కొనసాగించాలని రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర మినహా అన్నీ రకాల భవన నిర్మాణాలను సైతం ఆపివేసారు. బీఎస్ 3, బీఎస్ 4 డిజిల్ వాహానాల రవాణాను నియంత్రించారు.ఢల్లీ, నోయిడా, గురుగ్రాం, గజియాబాద్, ఫరిదాబాద్ లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. పొరుగునున్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను కాల్చడంతో అధిక శాతం ఈ వైపరిత్యం ఏర్పడిరది.
Tags