హైదరాబాద్ నవంబర్ 9 (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. గురువారం నాగు నేడు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతంతా నామినేషన్లు దాఖాలు చేశారు.. గురువారం నాడు మంచి మూహుర్తం ఉండటంతో నామినేషన్ల ప్రక్రియ ఊపంకుంది. గజ్వేల్ లో గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేయగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్ దాఖలు చేశారు.గురువారం ఉదయం మంత్రి హరీష్ రావు కొండగట్టు అంజన్న స్వామిని దర్శనం చేసున్నారు. తరువాత సిద్దిపేటకు చేరుకుని అక్కడి మోహిన్ పుర వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ల ప్రతాలపై సంతకాలు చేశారు. తరువాత భారీ ర్యాలీగా వెళ్లి సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖాలు చేశారు. మరోవైపు.. సిరిసిల్లలో
మంత్రి కేటీఆర్ నామినేషన్ వేశారు.ఉదయం 11:45 నిమిషాలకు సిరిసిల్లా ఆర్డిఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుడా గురువారం నామినేషన్ దాఖలు చేసారు. ఉదయాన్నే తల్లి లలితా వెంకటేశం యాదవ్ కాళ్ళను మొక్కి ఆశీర్వాదం పొందారు. వేద మంత్రాలతో మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం చేసారు.తరువాత కుటుంబ సభ్యులతో బయలుదేరి నామినేషన్ దాఖలు చేసారుఊపందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. నామినేషన్ దాఖలు చేసిన అగ్రనేతలు.
గురువారం, నవంబర్ 09, 2023
0
Tags