హైదరాబాద్, నవంబర్ 1, (ఇయ్యాల తెలంగాణ ); మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి మరోసారి సోషల్ విూడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. మాజీ ఎంపీ, బీజేపీ కీలక నేత విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. తన రాజకీయ జీవితంపై ఎమోషనల్‌గా స్పందించారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నడూ పదవులు ఆశించలేదని, ఇప్పటికీ ఊహించని విధంగా ఈ పరిస్థితి ఎదురవుతున్నదని అన్నారు. అప్పుడూ ఇప్పుడూ గొడవలే ఎదురవుతున్నాయన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘25 ఏళ్ల నా రాజకీయ ప్రయాణం అప్పుడు, ఇప్పుడు కూడా నాకు సంఘర్షణ మాత్రమే ఇచ్చింది.ఏ పదవి కావాలన్నా?ఇప్పటికీ పదవుల గురించి ఆలోచించడం లేదు. అయితే ఇప్పుడు తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన నిజం ఇదే. దశాబ్దాల క్రితం తెలంగాణ ఉద్యమం బాట పట్టిన మన పోరాట నాడు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉంటాం. ఈరోజు నా పోరాటం కేసీఆర్ కుటుంబాన్ని దోచుకోవడంపై, కొందరు బీఆర్‌ఎస్ నాయకుల అరాచకాలపై కాదు, తెలంగాణ ఉద్యమంలో నాతో కలిసి పనిచేసిన బీఆర్‌ఎస్ కార్యకర్తలపై. రాజకీయ విభేదాలకు అతీతంగా.. అన్ని పార్టీల తెలంగాణ బిడ్డలందరూ సంతోషంగా, గౌరవంగా ఉండాలని కోరుకోవడమే విూ రాములమ్మ ఉద్దేశం. హర హర మహాదేవ్. జై తెలంగాణ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేశారు. తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. కేసీఆర్ తో విభేదించి.. బయటకు వచ్చారు. భాజపాలో చేరిన తర్వాత ఆ పార్టీపై కూడా ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెలలో జరిగిన ప్రధాని పాలమూరు సభకు ఆమె హాజరు కాలేదు. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఆ తర్వాత తాను బీజేపీలోనే ఉన్నానని, సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేస్తానని విజయశాంతి ప్రకటించారు. కానీ ఆమెకు బీజేపీ, మలి జాబితాలో చోటు దక్కలేదు. రేపు మూడో జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే అందులో విజయశాంతి పేరు ఉంటుందా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం , అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది?.
ఏ పదవి ఏనాడు కోరుకోకున్న?
ఇప్పటికీ అనుకోకున్న కూడా?
అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం
0 కామెంట్‌లు