Ticker

6/recent/ticker-posts

Ad Code

దొరల పార్టీ నుంచి తెలంగాణను కాపాడుకుందాం

హైదరాబాద్‌, నవంబర్‌ 1, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరు జరగబోతుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. కచ్చితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.  ఈ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొని మాట్లాడారు.. ‘ధరణి పేరుతో భూముల్ని లాగేసుకునే కుట్ర జరుగుతోంది. ధరణితో లాభం జరిగింది కేవలం కల్వకుంట్ల కుటుంబానికే. ప్రభుత్వ సంస్థలు అన్ని నిర్వీర్యం చేశారు. రాష్ట్ర ప్రజల ధనం పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికే వెళ్తోంది. వారి చేతుల్లోనే రెవెన్యూ, ఎక్సైజ్‌ లాంటి శాఖలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కలలు కన్నది దొరల తెలంగాణ కోసం కాదు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో నీటి ప్రాజెక్టులను నిర్మించింది. నాగార్జున సాగర్‌, శ్రీరాం సాగర్‌, సింగూర్‌ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్‌ పార్టీనే. ఈ రాష్ట్రానికి వెన్నెముకగా మహిళలు ఉన్నారు. రైతు భరోసా అనే కార్యక్రమంతో కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వస్తోంది. రూ.15 వేలు ప్రతి ఏడాదికి, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల రూపాయలు ఇస్తాం. గ్రుహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంటు కాల్చే కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తాం. చేయూత పథకం కింద పింఛన్లు రూ.4 వేలు చేయబోతున్నాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్‌కు యుద్ధం జరుగుతోంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ` బీజేపీ ` ఎంఐఎం ఒకే తానుముక్కలుగా పని చేస్తున్నాయి. లోక్‌ సభలో ఏ బిల్లు వచ్చినా బీజేపీకి కేసీఆర్‌ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. దేశంలో విపక్ష ముఖ్యమంత్రుల విూద ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి. అదే తెలంగాణలో మాత్రం ఏ ఈడీ, విజిలెన్స్‌, సీబీఐ దాడులు ఏవిూ ఉండవు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఈ రెండూ కలిసి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాయి. విూరు ఎంఐఎంకి ఓటేసినా, బీఆర్‌ఎస్‌ ఓటేసినా వేస్ట్‌. బీజేపీకి ఓటేసినా పరోక్షంగా బీఆర్‌ఎస్‌కి ఓటేసినట్లే. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ను పడగొట్టడమే కాకుండా, 2024లో బీజేపీని రానివ్వకుండా అడ్డుకుంటాం. తెలంగాణ ప్రజలు స్పష్టతతోనే ఉన్నారు. ఈ రోజు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి. మన బంధం రాజకీయ బంధం మాత్రమే కాదు. కుటుంబ బంధం. చరిత్రలో ఇందిరా గాంధీకి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారు. ఈ విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. విూరందరూ తెలంగాణ కోసం పోరాడితే, సోనియా గాంధీ చారిత్రక నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని మంజూరు చేశారు’’ అని రాహుల్‌ గాంధీ మాట్లాడారు.

లూటీ చేసిన డబ్బులు కక్కిస్తాం;బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల నుంచి దోచుకున్న డబ్బులను కక్కించాలని రాహుల్‌ గాంధీ పిలుపు ఇచ్చారు. తెలంగాణకు కేసీఆర్‌ రాజులాగా వ్యవహరిస్తున్నారని, దొరల తెలంగాణకు ప్రజలకు మధ్య యుద్ధమని అన్నారు. కేసీఆర్‌ లూటీ చేసిన డబ్బుల్ని విూ అకౌంట్లలో వేసేలా ప్రయత్నం చేస్తామని రాహుల్‌ గాంధీ చెప్పారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో విజయభేరి యాత్ర పేరుతో తెలంగాణ కాంగ్రెస్‌ సభ నిర్వహించింది. ఈ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌, బీజేపీపై ఆరోపణలు చేశారు. ‘‘నాకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని కూడా గుంజుకున్నారు. దాంతో నేను ఆ ఇంటిని సంతోషంగా ఇచ్చేశా. మొత్తం దేశం, తెలంగాణ అంతా నా ఇల్లు. అవసరమైతే కోట్లాది మంది ప్రజలు అక్కున చేర్చుకుంటారు. బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారిపైన ఈడీ, సీబీఐ కేసులు ఉంటాయి. కానీ, బీఆర్‌ఎస్‌ పైన ఇలాంటివేవిూ ఉండవు. బీజేపీ పెద్దలు తెలంగాణకు వచ్చి ఓబీసీ వ్యక్తిని సీఎంగా చేస్తానంటారు. ఇక్కడ వారికి రెండు శాతం ఓట్లు వస్తే సీఎంని ఎలా చేస్తారు. వీళ్ల తీరు ఎలా ఉందంటే.. అమెరికా అధ్యక్షుడిగా ఓబీసీ వ్యక్తిని మోదీ అమెరికా వెళ్లి చెప్పినట్లుంది.మహారాష్ట్ర, రాజస్థాన్‌, అసోం, ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎక్కడైనా కాంగ్రెస్‌ పోటీ చేస్తే, అక్కడ ఎంఐఎం అభ్యర్థులు ప్రత్యక్షం అవుతారు. వాళ్లంతా అక్కడ బీజేపీ అభ్యర్థులకు సాయపడడానికి వస్తారు. ఈ ఎంఐఎం వాళ్లకు డబ్బులు కూడా బీజేపీనే ఇస్తుంది. అందుకే ఎంఐఎం ` బీజేపీ ` బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకటే శక్తి. తెలంగాణలో బీజేపీ టైర్లు పంచర్‌ చేసినట్లుగానే కేంద్రంలో కూడా బీజేపీ టైర్లు పంచర్‌ చేస్తాము. ఇక్కడ తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ గఢ్‌లో కూడా గెలవబోతున్నాం. తర్వాత కేంద్రంలోనూ గెలుస్తాం. అందరం కష్టపడి ఇక్కడ బీఆర్‌ఎస్‌ను ఓడిద్దాం. జనరల్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడిద్దాం’’ అని రాహుల్‌ గాంధీ పిలుపు ఇచ్చారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు