హైదరాబాద్ నవంబర్ 3 (ఇయ్యాల తెలంగాణ ):ఎన్నికల సమయంలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సంచలనం నిర్ణయం తీసుకు న్నారు. బీఆర్‌ఎస్కు ఈ నిర్ణయం బిగ్ షాక్ అనే చెప్పాలి. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించడం సెన్సేషన్గా మారింది. సీఎం కేసీఆర్ను ఓడిరచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్న షర్మిల ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల మళ్లీ ఆయనే సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. దానిలో భాగంగా తనను అనేక మంది మేధావులు సంప్రదిం చారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఇక్కడ గ్రాఫ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీని తాను ఎప్పుడూ వేరుగా చూడలేదన్నారు. కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల పేర్కొన్నారు.పాలేరు విషయంలో షర్మిల భావోద్వేగానికి గురయ్యారు.వైఎస్సార్టీపీ నేతలు, కార్యక ర్తలకు క్షమాపణ చెప్పారు. రాజకీయంగా తీసుకున్న నిర్ణయం పట్ల ఎవరైనా బాధ పడితే మన్నిం చాలని వేడుకున్నారు. పాలేరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తన విూద ఉందన్నా రు. తాను పోటీ చేస్తానని మాట ఇచ్చానని షర్మిల వెల్లడిరచారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నానని.. దానికి ఇంకా సమయం ఉందన్నారు.
క్షమించండి..మన్నించండి పార్టీ నేతలు, కార్యకర్తలకు సారీ షర్మిల
శుక్రవారం, నవంబర్ 03, 2023
0

Tags