Ticker

6/recent/ticker-posts

Ad Code

వరంగల్‌ కార్పొరేషన్‌ లో భారీ స్కామ్‌

 

వరంగల్‌, నవంబర్‌ 1, (ఇయ్యాల తెలంగాణ );గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్కార్పొరేషన్లో ఇటీవల బయటపడిన భారీ స్కామ్‌ మలుపులు తిరుగుతోంది. గతంలో ఇక్కడ కమిషనర్‌ గా పనిచేసిన పమేలా సత్పతి సంతకాలను ఫోర్జరీ చేసి ఓ ఉద్యోగి దాదాపు రూ.2.31 కోట్లు కొల్లగొట్టగా.. ఈ బాగోతంపై విచారణ జరుగుతోంది. కేవలం ఒక్క ఉద్యోగే ఇదంతా చేశాడని మొదట భావించినా.. పోలీసుల విచారణలో ఇతర ఉద్యోగుల పేర్లు బయటపడుతున్నాయి. దీంతో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో టెన్షన్వాతావరణం నెలకొంది. కాగా పోలీసుల విచారణలో ఇంకెంతమంది బయటపడతారోననే చర్చ జరుగుతోంది.2021లో గ్రేటర్వరంగల్‌ కమిషనర్‌ గా పమేలా సత్పతి పనిచేసిన సమయంలో క్యాంప్‌ క్లర్క్‌(సీసీ)గా బండా అన్వేశ్విధులు నిర్వర్తించాడు. స్మార్ట్సిటీ కన్సల్టెన్సీలకు చెల్లింపులు, డీపీఆర్‌, ఇతర టెండర్లకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, కమిషనర్సంతకం ఫోర్జరీ చేసి దాదాపు రూ.2.31 కోట్లు కొల్లగొట్టాడు. వాటిని గతంలో ఇక్కడ పనిచేసిన సీనియర్‌అసిస్టెంట్‌ఉమాకాంత్‌, ప్రీ ఆడిట్‌ విభాగంలో పనిచేసే మరో సీనియర్‌అసిస్టెంట్జన్నం సతీశ్సహాయంతో సొమ్మునంతా కాజేశాడు. అనంతరం తన స్నేహితులు, కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి డబ్బులు మళ్లించి, ఆ తరువాత వాటిని డ్రా చేశాడు. కాగా ఓ ఫైల్విషయంలో మోసాన్ని పసిగట్టిన అప్పటి కమిషనర్‌ పమేలా సత్పతి 2021లోనే కిందిస్థాయి ఆఫీసర్లను ఎంక్వైరీ చేయాల్సిందిగా ఆదేశించారు. కానీ గ్రేటర్‌ ఎన్నికలు, ఆ తరువాత వివిధ కారణాల వల్ల రెండేండ్ల పాటు అంతర్గత విచారణ జరిగింది.సీసీ అన్వేశ్‌ మోసం చేసినట్లు నిర్ధారణ జరిగినా.. ఈ విషయాన్ని కొందరు అధికారులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే పమేలా సత్పతి ఇక్కడి నుంచి బదిలీ అయి సీడీఎంఏగా బాధ్యతలు స్వీకరించగా.. తన సంతకం ఫోర్జరీ చేసి, నిధులు దుర్వినియోగం చేయడాన్ని సీరియస్గా తీసుకుని విచారణను ముమ్మరం చేయించారు. దీంతో అసలు బాగోతం బయటపడగా.. రూ.2,31,91,076 సొమ్మును అన్వేశ్‌ మళ్లించినట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఇటీవల సీసీ అన్వేశ్ను సస్పెండ్చేసి వరంగల్‌ మట్వాడా పోలీస్స్టేషన్‌ లో కేసుపెట్టారు.బల్దియాలో సీసీ అన్వేశ్పదేండ్లుగా పనిచేస్తున్నాడు. నిధుల మళ్లింపు విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించారు. ఇంత పెద్ద మొత్తాన్ని ఒక్కడే స్వాహా చేశాడా అనే కోణాల్లో విచారించారు. దీంతో బయటపడిన విషయాలతో పోలీసులే షాక్‌అయ్యారు. జీడబ్ల్యూఎంసీ అకౌంట్స్వింగ్లో పని చేసే ఉద్యోగితో పాటు ప్రీ ఆడిట్విభాగంలోని మరో ఉద్యోగి కూడా ఆయనకు సహకరించినట్లు ప్రాథమికంగా గుర్తించి, వారినీ పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఈ మేరకు అనశ్ఫ్ఫ్రాడ్కు సహకరించిన గతంలో ఇక్కడ పనిచేసిన సీనియర్‌అసిస్టెంట్‌ఉమాకాంత్ను ఇదివరకే అరెస్ట్చేశారు. అనంతరం లోతైన దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో నిందితుడు ప్రీ ఆడిట్వింగ్‌ లో పనిచేసే సతీశ్పేరు కూడా బయటపడిరది. దీంతో ఆయనను సోమవారం అరెస్ట్‌ చేశారు. కేవలం వీరి ముగ్గురితోనే అయిపోతుందనుకుంటే విచారణలో మరో ఆరుగురు కూడా అన్వేశ్కు సహకరించినట్లు తేలిందిసంతకాలు ఫోర్జరీ, నకిలీ బిల్లులు తయారు చేసి కాజేసిన సొమ్మును అన్వేశ్‌ తన స్నేహితులు, కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించినట్లు తేలింది. మొత్తం ఆరుగురి అకౌంట్లలోకి డబ్బును మళ్లించి, ఆ తరువాత డ్రా చేసుకునేవాళ్లని పోలీసులు తెలిపారు. కాగా అన్వేశ్స్నేహితులు నరేశ్‌, పునేందర్‌, సాయికృష్ణ, రమణాచారి, అన్వేశ్‌ చెల్లెల్లు వీణ, జ్యోత్స్న ఖాతాల్లో జమ చేసేవాళ్లని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు వారిని కూడా సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కాగా కమిషనర్సంతకం ఫోర్జరీ చేసి, నకిలీ దస్త్రాలతో బిల్లులు కాజేసిన కేసులో ఇప్పటికి మొత్తం 9 మంది అరెస్ట్‌ కాగా.. పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. దీంతో బల్దియాలో పనిచేసే మిగతా ఉద్యోగుల్లో కూడా టెన్షన్కనిపిస్తోంది. కాగా ఇంకా ఎంతమంది ఈ స్కామ్‌ లో పాలుపంచుకున్నారో పూర్తి విచారణలో బయటపడే అవకాశం ఉంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు