హైదరాబాద్ నవంబర్ 1 (ఇయ్యాల తెలంగాణ ):పాత బస్తి లో పోలీసులు కమ్యూనిటీ కనెక్ట్ నిర్వహించారు. చార్మినార్ పీఎస్ పరిధిలోని పార్దివాడ, పురానాపూల్లో జరిగిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో 160 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లో సరైన పత్రాలు లేని 30 వాహనాలు సీజ్ చేసారు. .కొన్ని బెల్ట్ షాపులపై దాడులు చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సౌత్ డీసీపీ పి.సాయి చైతన్య విూడియాతో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, హైదరాబాద్ సీపీ ఆదేశాల మేరకు ఈ కమ్యూనిటీ కనెక్టు కార్యక్రమం నిర్వహించామని అన్నారు. రౌడీలు, నేరస్తులకు దూరంగా ఉండాలని డీసీపీ హెచ్చరించారు.
0 కామెంట్‌లు