హైదరాబాద్, నవంబర్ 2, (ఇయ్యాల తెలంగాణ );టీబీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 35 మంది అభ్యర్థులతోపాటు పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లను కేటాయించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ కోర్ కమిటీ నేతలు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తెలంగాణ కోర్ కమిటీ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్, డా. కే. లక్ష్మణ్, ప్రకాశ్ జవడేకర్, తరుణ్ చుగ్ హాజరయ్యారు.సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలోనే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఢల్లీిలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయ తీసుకున్నారు. జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా కమిటీ నేతలు పాల్గొన్నారు. బుధవారం అర్థరాత్రి వరకు జరిగిన ఈ భేటీలో తొలుత రాజస్థాన్‌లో మిగిలిన 76 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.
35 మందితో జాబితా విడుదల చేసిన బీజేపీ
మంచిర్యాల`రఘునాథ్, ఆసిఫాబాద్`ఆత్మారామ్ నాయక్
బోధన్`మోహన్‌రెడ్డి, బాన్సువాడ`యెండల లక్ష్మీనారాయణ
నిజామాబాద్ రూరల్`దినేష్, మంథని`సునీల్‌రెడ్డి
మెదక్`విజయ్‌కుమార్, నారాయణఖేడ్`సంగప్ప
ఆందోల్`బాబుమోహన్, జహీరాబాద్`రాజనర్సింహ
ఉప్పల్`ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
ఎల్బీనగర్`సామరంగారెడ్డి
రాజేంద్రనగర్`శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల`ఐూ రత్నం
పరిగి`మారుతీ కిరణ్, ముషీరాబాద్`పూసరాజు
మలక్‌పేట్`సురేందర్‌రెడ్డి, అంబర్‌పేట్`కృష్ణయాదవ్
జూబ్లీహిల్స్`దీపక్‌రెడ్డి
సనత్‌నగర్`మర్రి శశిధర్‌రెడ్డి
సికింద్రాబాద్`మేకల సారంగపాణి
వాటిలో 70 స్థానాలకు అభ్యర్థులను కమిటీ ఖరారు చేసింది. మిగతా 6 స్థానాలను పెండిరగులో పెట్టిన కమిటీ, వాటికి అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతను పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాకే వదిలేసింది. తర్వాత తెలంగాణపై బీజేపీ సీఈసీ సమావేశమైంది. తెలంగాణలో మిగిలిన 66 స్థానాలపై చర్చించారు. జనసేనకు పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు కేటాయించాలన్న విషయంపై కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది. జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు అధినాయకత్వం అంగీకారం తెలిపింది.
0 కామెంట్‌లు