తిరుపతి అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):తిరుపతిజిల్లా ??నాయుడుపేటలో మల్లం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో పుదూరు ఎంపిటీసి భర్త దయానందం మృతి చెందాడు. నాయుడుపేట పట్టణంలోని మల్లాం జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పుదూరు ఎంపీటీసీ సభ్యురాలు కంచి నరసమ్మ భర్త వైసీపీ నాయకులు కంచి దయానందం మృతి చెందారు. పుదూరు నుంచి నాయుడుపేటకు మోటర్ సైకిల్ లో వస్తుండగా మల్లాం క్రాస్ రోడ్డు వద్ద టిప్పర్ ఢీకొనడంతో దయానందం అక్కడికక్కడికే మృతి చెందారు.