Ticker

6/recent/ticker-posts

Ad Code

SIKKIM లో మెరుపు వరదలు.. 23 మంది ARMY సిబ్బంది గల్లంతు


గ్యాంగ్టక్‌ అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ ):  ఈశాన్య రాష్ట్రం సిక్కింలో బుధవారం ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తర సిక్కింలో కురిసిన కుండపోత వర్షానికి లాచెన్‌ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో ఈ వరదలు చోటుచేసుకున్నాయి. తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలగుండా ప్రవహిస్తోంది. రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌ టక్‌ కు 30 కిలోవిూటర్ల దూరంలో వున్న సింగ్టం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. తీస్తా నది పరిసరాల్లో వున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  ఇందులో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడిరచాయి. కొన్ని వాహనాలు కూడా నీటమునిగాయి. ఆర్మీ సిబ్బంది కోసం భారీఎత్తున గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడిరచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. పునరావస చర్యలు వేగవంతం చేసామని అయన అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు