అక్టోబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ); SC ఉపకులాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆత్మగౌరవ సభ నిర్వహించినట్లు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమగర ఉపజాతి అధ్యక్షుడు చంద్రగిరి సత్యనారాయణ పేర్కొన్నారు. 57 ఎస్సీ ఉపకులాల వ్యవస్థాపక అధ్యక్షుడు భైరి వెంకటేశ్ నాయకత్వంలో బుధవారం సికింద్రాబాద్ దోభిగాట్ మైదానం లో జరిగిన ఉపకులాల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ బిఆర్అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరిసత్యనారాయణమీడియాతో మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా తమ ఉపకులాలు సమస్యలపరిష్కారం కోసం ఎన్ని పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో నేటికి సమగర, మోచీ చిందు,మాష్ఠీన్ బేడ బుడగ జంగంచేంచులు తదితర ఉపకులాలకు చెందిన వారికి ఇప్పటికి కుల ద్రువీకరణ పత్రాలు , విద్యా వైద్యం సామాజిక న్యాయం జరగక దుర్భర జీవితాలు గడుపుతున్నారని తెలిపారు. కళాకారులకు చేతి వృత్తిదారులకు పనులు దొరకక కుటుంబ భారాలు మోయలేక సంచార బతుకులు వెల్లదిస్తున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇలాంటి భాదలు భారాలు భరించలేకనే భైరి వెంకటేశ్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆత్మగౌరవ సభలు యుద్ధ భేరీలు నిర్వహించి తమ హక్కులను సాదించుకుంటామనిఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర సమగర నాయకులు మాస సత్యనారాయణ, క్రిష్ణ బెహర్జి,గణపతి కల్యాణ్,విజయ్ కుమార్ బేహర్జి,జితేంధర్,బలరాం ఉత్కార్,
రాజేష్ కల్యాణి,సల్లా సతీష్,జీ ప్రకాష్, స్వామి మాస శ్రినివాస్ కిషన్ దామా లక్ష్మణ్ వాగ్ మారే
రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రగిరి వినోద్ కుమార్, మధు మారుతి గైక్వాడ్ మాన్కార్ శివ
0 కామెంట్‌లు