రూల్స్ రంజన్’ రొటీన్ కాదు.. ఆకర్షణీయమైన లవ్ థీమ్‌ను కలిగి ఉంది: కథానాయిక నేహా శెట్టి
అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మచ్ అవైటెడ్ మూవీ ‘రూల్స్ రంజన్’లో నటి నేహా శెట్టి, సనా అనే పాత్రను పోషించారు.కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా విడుదల నేపథ్యంలో సోమవారం విలేఖర్లతో ముచ్చటించిన నేహా చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు.
వరుస విజయాలతో తెలుగులో విూరు ఘనమైన ప్రారంభాన్ని పొందారని భావిస్తున్నారా?
ఖచ్చితంగా చెప్పలేను, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని నేను భావిస్తున్నాను. కానీ చాలా తక్కువ సమయంలో నేను సాధించిన దాని పట్ల చాలా సంతోషంగా, కృతజ్ఞతతో ఉన్నాను.
డీజే టిల్లుతో విూ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది, దాన్ని విూరెలా చూస్తున్నారు?
నా మొదటి సినిమా మెహబూబా విజయం సాధించలేదు. ఆ తర్వాత నేను యాక్టింగ్ కోర్స్ కోసం న్యూయార్క్ వెళ్లాను. నేను ఎన్నో ఆశలతో మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాను. కానీ కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా మరికొంత కాలం వేచి ఉండాల్సి వచ్చింది. అప్పుడే నాకు డీజే టిల్లులో రాధిక క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది. సినిమా థియేటర్లలో విడుదలయ్యాక, ప్రేక్షకులు వెంటనే ఆ పాత్రతో కనెక్ట్ అయ్యారు. ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
రూల్స్ రంజన్‌లో విూ పాత్ర గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుందా?
రూల్స్ రంజన్‌లో నేను సన పాత్ర పోషించాను. డీజే టిల్లులో రాధికలాగా సనాది స్వార్థపూరిత పాత్ర కాదు. ఆమె తిరుపతికి చెందిన సంతోషకరమైన అమ్మాయి. ఆమె సాహసోపేతమైనది మరియు ప్రపంచాన్ని అన్వేషించాలని కోరుకుంటుంది. పాత్ర పరంగా సన గ్లామర్‌గా ఉంటుంది. అందమైన, బబ్లీ మరియు పక్కింటి అమ్మాయి తరహా పాత్ర.
రూల్స్ రంజన్ తరహా వ్యక్తులను విూ నిజ జీవితంలో చూశారా?
దర్శకుడు రత్నం కృష్ణ ఏ సమయంలోనైనా తన నియమాలకు కట్టుబడి ఉంటారు. పర్ఫెక్ట్ గా, ఫోకస్డ్ గా ఉంటారు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడమే అందుకు కారణం. ఆయన ఏమి చేయాలి అనేది ఆయనకు స్పష్టమైన ఆలోచన ఉంటుంది.
సంగీత దర్శకుడు అమ్రిష్ తో పని చేయడం ఎలా అనిపించింది?
అంతకుముందు సంగీత దర్శకుడు అమ్రిష్‌ని నేను వ్యక్తిగతంగా కలవలేదు. ప్రెస్ విూట్‌లు, ప్రచార కార్యక్రమాల సమయంలోనే చూశాను. ఆయన పాటలు విని, విూ అందరిలాగే నేనూ ఫ్యాన్ అయ్యాను. ఆయన సంగీతం అందించిన విధానం అద్భుతం. నేను మేము ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించగలిగాము అంటే దీనికి కారణం టీమ్ అని నేను భావిస్తున్నాను. అవ్రిూష్, రత్నం కృష్ణ, కిరణ్ అబ్బవరం అందరూ కలిసి ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు.
రూల్స్ రంజన్ లో రొమాంటిక్ ట్రాక్ కొత్తగా ఉండబోతుందా?
రూల్స్ రంజన్ కథ భిన్నంగా ఉంటుంది. అందులో సంఘర్షణ ఉంది. కామెడీ ఉంది. ఇది రొటీన్ అబ్బాయి`అమ్మాయిల కథ కాదు. ఇది ఆకర్షణీయమైన లవ్ థీమ్‌ను కలిగి ఉంది. దానిని విభిన్నంగా మలిచారు. నా గత చిత్రాల మాదిరిగానే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను.
రూల్స్ రంజన్‌లో విూకు ఛాలెంజింగ్ గా అనిపించింది ఏంటి?
సమ్మోహనుడా పాటకి డ్యాన్స్ చేయడమే అత్యంత ఛాలెంజింగ్ టాస్క్. విూరు పాటను గమనిస్తే, నేను నిప్పులో, నీటిలో, పువ్వుల మధ్య మరియు కొలను పక్కన నృత్యం చేయాల్సి వచ్చింది. చిత్రీకరణ చాలా కఠినంగా ఉంది. విలువైనవి ఛాలెంజింగ్ గా ఉంటాయి. కానీ చివరికి శ్రమకి దానికి తగ్గ ఫలితం లభిస్తుంది.
కిరణ్ అబ్బవరంతో కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అయింది?
నటుడిగా కిరణ్ చాలా కూల్. అతను సెట్స్‌లో వినయంగా, కామ్ గా ఉంటాడు. నేను మాత్రం పూర్తి వ్యతిరేకం (నవ్వుతూ). కెమెరా ముందు ఫ్రీగా ఉండాలని సెట్స్ లో సరదాగా మాట్లాడిస్తాను. దర్శకుడు, ఇతర నటీనటులతో కూడా అలాగే చేస్తాను. ఇక వెన్నెల కిషోర్ గారు సెట్స్ లో ఉండటం చాలా సరదాగా ఉంటుంది.
అక్టోబర్ 6న రూల్స్ రంజన్ విడుదల కాబోతోంది. ఎలా ఫీలవుతున్నారు?
రూల్స్ రంజన్ నాకు హ్యాట్రిక్ అవుతుందా అని కాస్త భయపడుతున్నాను. కానీ నిస్సందేహంగా చెప్పగలను. మేమందరం చాలా చక్కగా పని చేసి, ఓ మంచి ఎంటర్‌టైనర్‌ను రూపొందించాము. కానీ నాలో కాస్త టెన్షన్ ఉంది. ఆఏ టిల్లు తర్వాత, బెదురులంక 2012లో సంప్రదాయ కుటుంబానికి చెందిన అందమైన, పల్లెటూరి అమ్మాయిగా నేను చేసిన పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే అనుమానం నాకు కలిగింది. అభిమానులు నన్ను ఆదరిస్తారా అనే సందేహం వచ్చింది. కానీ థియేటర్లలో విడుదలయ్యాక నా అనుమానాలన్నీ బద్దలయ్యాయి. సన పాత్ర కూడా తప్పకుండా అభిమానులను అలరిస్తుందని నేను నమ్ముతున్నాను.
గతంలో వాన పాటలు బాగా పాపులర్. ఇప్పుడు విూరు నటించిన వాన పాటకు లభిస్తున్న ఆదరణ ఎలా అనిపిస్తుంది?
వాన పాటల విషయానికి వస్తే, నాకు అలనాటి తార దివంగత శ్రీదేవి గుర్తుకు వస్తారు. నేను ఆమెకి పెద్ద అభిమానిని. చాలా చిన్న వయస్సులో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆమె, ఎలాంటి హద్దులు లేకుండా ఉన్నత స్థాయికి చేరారు. అలాంటి నటిగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. నా మొదటి పాటలో రెయిన్ సీక్వెన్స్ ఉండడం, ఆ పాటకి ఈ స్థాయి స్పందన లభిస్తుండటం చాలా ఆనందంగా ఉంది.
0 కామెంట్‌లు