హైదరాబాద్, అక్టోబరు 1, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణలో పసుపు బోర్డు, ట్రైబల్ వర్శిటీ తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. గత ఎన్నికల సమయంలో నిజమాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారని బీజేపీ నేతలపై విమర్శలున్నాయి. ఈ క్రమంలో మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతకుముందు మహబూబ్‌నగర్ నుంచి 13,500 కోట్లతో చేపట్టనున్న పలు రకాల అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇందులో జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులున్నాయి. ప్రధాని మోదీ నాగ్ పూర్` విజయవాడ ఎకనమిక్ కారిడార్ కు శంకుస్థాపన చేశారు. భారత్ పరియోజన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్` విశాఖపట్నం కారిడార్ ను జాతికి అంకితం చేశారు. ఆయిల్ అండ్ గ్యాస్ ఫైప్ లైన్ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్` రాయచూరు ట్రైన్ ను ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు చెందిన ఆరు కొత్త భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
పాలమూరులో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి తర్వాత ప్రపంచానికి పసుపు గొప్పదనం తెలిసిందన్నారు. దాంతో పలు దేశాలలో పసుపుపై పరిశోధనలు పెరిగాయని తెలిపారు. దేశంలో అత్యధికంగా తెలంగాణలో పసుపు ఉత్పత్తి అవుతుందని తెలిసిందే. రాష్ట్రంలో పసుపు రైతులకు ప్రయోజనం కలుగుతుందని పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. తెలంగాణకు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు మోదీ వెల్లడిరచారు. రూ.900 కోట్ల వ్యయంతో ములుగు జిల్లాలో సమ్మక్క` సారక్క గిరిజన యూనివర్సిటీ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాజాగా చేపట్టిన వేల కోట్ల పనులతో ఎన్నో వేల మందికి ఉపాధి దొరుకుతుందని, ప్రయోజనం కలుగుతుందన్నారు. మరోవైపు తెలంగాణలో పలు జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని, వాటికి నిధులు అందిస్తున్నామని చెప్పారు. హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణ అనుసంధానం పెరిగిందన్నారు.హన్మకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వరంగల్ ? ఖమ్మం ? విజయవాడ హైవే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం`హైదరాబాద్ మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్త భవనాలు ప్రారంభించారు. హసన్`చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సూర్యాపేట ? ఖమ్మం జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ.దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం అన్నారు.అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నారని మంత్రి కేటీఆర్ ఇటీవల తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ కు చేరుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా శంకుస్థాపనలతో పాటు కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు.
0 కామెంట్‌లు