Ticker

6/recent/ticker-posts

Ad Code

ముగ్గురి కి PHYSICS లో NOBEL PRIZE


హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఇయ్యాల తెలంగాణ ):2023 సంవత్సరానికి గాను నోబెల్‌ బహుమతులను ప్రకటించారు. ఫిజిక్స్‌ విభాగంలో ముగ్గురికి నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వనున్నారు. రాయల్‌ స్వీడిష్‌ అకాడవిూ ఆఫ్‌ సైన్సెస్‌ 2023 భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని పియరీ అగోస్టినీ, ఫెరెన్క్‌ క్రౌజ్‌, అన్నే ఎల్‌’హుల్లియర్‌లకు అందించాలని నిర్ణయించింది. ఇంతకుముందు కాటలిన్‌ కారికో, డ్రూ వీస్‌మాన్‌ వైద్య రంగంలో 2023 నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. స్ప్లిట్‌ సెకనులో పరమాణువులను పరిశీలించినందుకు ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. యూఎస్‌లోని ఓహియో స్టేట్‌ యూనివర్శిటీకి చెందిన పియరీ అగోస్టినీ, జర్మనీలోని మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్వాంటమ్‌ ఆప్టిక్స్‌కు చెందిన ఫెరెన్క్‌ క్రౌజ్‌, మ్యూనిచ్‌లోని లుడ్విగ్‌ మాక్సిమిలియన్‌ యూనివర్శిటీ, స్వీడన్‌లోని లండ్‌ యూనివర్శిటీకి చెందిన అన్నే ఎల్‌’హుల్లియర్‌లకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఇంతకుముందు, కాటలిన్‌ కారికో, డ్రూ వీస్‌మాన్‌ వైద్య రంగంలో 2023 నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. కొవిడ్‌`19కి వ్యతిరేకంగా కొవిడా టీకా కోసం నిరంతరంగా కృషి చేసినందుకు గాను ఇద్దరు శాస్త్రవేత్తలకు ఈ అవార్డు లభించింది.మంగళవారం స్టాక్‌హోమ్‌లో రాయల్‌ స్వీడిష్‌ అకాడవిూ ఆఫ్‌ సైన్సెస్‌ సెక్రటరీ జనరల్‌ హన్స్‌ ఎల్‌గ్రెన్‌ ఈ బహుమతిని ప్రకటించారు. నోబెల్‌ బహుమతి 11 మిలియన్‌ స్వీడిష్‌ క్రోనార్‌ (వి1 మిలియన్‌) నగదు బహుమతిని కలిగి ఉంటుంది. ఈ నోబెల్‌? అవార్డులను 1901 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. స్వీడెన్‌?కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ఆల్‌?ఫ్రెడ్‌? నోబెల్‌? వీటిని ఇచ్చేవారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ అవార్డులను కొనసాగిస్తున్నారు.ల్ఫ్ఫ్రెడ్‌ నోబెల్‌ 1896 సంవత్సరంలో మరణించారు. వైద్యం, శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక విభాగాల్లో నోబెల్‌? బహుమతిని ప్రకటిస్తారు. ఈసారి వైద్య రంగంతో ఈ ఈవెంట్‌? మొదలైంది. రానున్న రోజుల్లో ఇతర బహుమతులను ప్రకటిస్తారు బుధవారం కెమిస్ట్రీకి, గురువారం సాహిత్యానికి నోబెల్‌ బహుమతిని ప్రకటిస్తారని తెలిసిన విషయమే. అదే సమయంలో శుక్రవారం నోబెల్‌ శాంతి బహుమతిని, అక్టోబర్‌ 9న ఆర్థిక శాస్త్ర బహుమతిని ప్రకటించనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు